అంతర్జాతీయంరాజకీయాలు

ప్రమాదంలో పిల్లల ప్రాణాలు!

Chidrens corona

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం కోవిద్, దక్షిణ ఆసియాలోని లక్షలాది మంది పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వివరించింది.

కరోనా కేసులే కాదు మ‌ర‌ణాల సంఖ్య మరింత పెరుగుతుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రజలు మాత్రం కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని డబ్ల్యూహెచ్ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం వుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్!

కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సామర్థ్యంలో రెండు ఫార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. అందులో ఆస్ట్రాజెనికా మొదటి స్థానంలో ఉండగా.. మోడర్నా కూడా పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు. కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా.. 15 మాత్రమే క్లినిక్ ట్రయల్స్ దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సినోవాక్ సహా చైనాకు చెందిన పలు సంస్థలతో కరోనాకు సూది మందు అభివృద్ధి గురించి మాట్లాడిందని సౌమ్య పేర్కొన్నారు.