ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Vijayanagaram: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

Two youths were killed in a lightning strike

ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పద్మనాధం మండలం చాకలిపేట గ్రామంలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తూ మామిడి తోటలో సేద తీరుతుండగా ఈదురుగాలలతో కురిసిన వర్షంలో పిడుగు పడింది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Back to top button