వైరల్

శరీరానికి నిప్పు అంటించుకొని ప్రపోజ్ చేశాడు.. చివరికి?

ఒక వ్యక్తి మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగటానికి పెద్ద రిస్క్ చేశాడు..

సాధారణంగా ప్రేమించడం కంటే ఆ ప్రేమను అవతలి వ్యక్తులకు వ్యక్తపరచటం, పెళ్లికి ఒప్పించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ అవతలి వ్యక్తులకు మనం అంటే ఇష్టం ఉంటే మాత్రం ఒప్పించడం సులభమే. ప్రేమను వ్యక్తపరచటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగటానికి పెద్ద రిస్క్ చేశాడు. తనను తాను మంటల్లో కాల్చుకుంటూ పెళ్లి చేసుకుంటావా…? అని ప్రియురాలిని అడిగాడు.

పెళ్లి చేసుకోమని అడగటానికి మంటల్లో కాల్చుకోవడం ఏంటి…? అనే అనుమానం కలుగుతుందా…? అయితే మీరు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రేమను వ్యక్తపరిచిన వ్యక్తి స్టంట్ మ్యాన్ గా పని చేస్తాడు. గతంలో ఎన్నో స్టంట్లు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి మంటల్లో కాల్చుకుంటూ చేసిన మ్యారేజ్ ప్రపోజల్ యువతికి ఎంతగానో నచ్చింది. వెంటనే సదరు యువతి పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూకేలో ఈ ఘటన చోటు చేసుకుంది. 52 సంవత్సరాల రికీ ఆష్ స్టంట్ మ్యాన్ గా పని చేసే వాడు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని అతనికి 48 సంవత్సరాల వయస్సు గల క్యాట్రినా డాబ్సన్ అనే నర్సు నచ్చింది. ఆమెను స్టూడియోకు రమ్మని ఆహ్వానించిన రికీ అక్కడ ఆమెను నల్ల తెర ముందు కూర్చోబెట్టి అతని స్నేహితులతో సూట్ కు నిప్పు పెట్టించుకున్నాడు. అనంతరం జేబులో నుండి రింగ్ ఇస్తూ క్యాట్రినాకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఇలా ప్రపోజ్ గతంలో తాను చూడలేదని క్యాట్రియా పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

https://twitter.com/nypost/status/1293230753728299009

Back to top button