అప్పటి ముచ్చట్లుసినిమా వార్తలు

ఇద్దరు ‘సీఎం’లు నటించిన ఈ సినిమా ఎలా తీశారో ?

Ali Baba 40 Dongalu
‘ఆలీబాబా 40 దొంగలు’ ఇద్దరు సీఎంలు కలిసి నటించిన సినిమా ఇది. బి విఠలాచార్య దర్శకత్వంలో గౌతమీ పిక్చర్స్ పతాకం పై నిర్మింపబడిన ఈ జానపద సినిమా, ఆ రోజుల్లో అనగా 1970 దశకంలో అత్యంత ప్రేక్షకాధరణ పొంది.. ఎన్టీఆర్, జయలలిత కెరీర్ ల్లోనే గొప్ప సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా సెట్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. కరెక్ట్ షూటింగ్ టైంకి మేకప్ తో సెట్ లోకి వచ్చి నిలబడటం అనేది మొదటి నుండి ఎన్టీఆర్ కి ఉన్న అలవాటు. అయితే జయలలిత కూడా ముందుగానే షూటింగ్ స్పాట్ లోకి వచ్చినా.. చెప్పిన టైంకి మాత్రం ఆమె ఎప్పుడూ షూట్ కి వచ్చేది కాదట.

తన మేకప్ విషయంలో జయలలిత చాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమె సెట్ లోకి రావడానికి చాల సమయం తీసుకునేవారు. అయితే ‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమా విషయంలో మాత్రం ఆమె కరెక్ట్ టైంకి సెట్ లోకి వచ్చి నిలబడేది. కారణం అడిగితే, తనకు ఎన్టీఆర్ గారి పై ఉన్న గౌరవమే అని నవ్వుతూ చెప్పిందట. నిజానికి జయలలిత తన కెరీర్ మొదటి నుండి రెబల్ గా ఉండేవారు. ఆమెను చూసి ఆ రోజుల్లో స్టార్ హీరోలు కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఆమె మాత్రం ఎప్పుడూ ఇద్దరు హీరోలను బాగా గౌరవించే వారు.

ఆ హీరోలే తమిళనాట ఆరాధ్య నటుడు ఎంజీఆర్, తెలుగునాట యుగపురుషుడు ఎన్టీఆర్. వీళ్ళద్దరు అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ఆమె అప్పటి ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. ఇక ‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమా విషయానికి వస్తే.. ఒక అడవి ప్రక్క గ్రామంలో తన తల్లితో నివాసం ఉండే ఆలీబాబా, కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఒక గుహలోకి వెళ్లడం, అక్కడ అపార సంపద ఉండటం, దాన్ని తీసుకెళ్లిన అలీబాబా జీవితం అనేక మలుపులు తిరగడం ఇలా కథలో కూడా అనేక మలుపులు ఉంటాయి. గ్రాఫిక్స్ పెద్దగా లేని ఆ రోజుల్లో ఈ సినిమాని ఎలా తీసారా అని మనకు ఆశ్చర్యం కలగక మానదు.

Back to top button