విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

UPSC Recruitment 2021

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్ 2021 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 27 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 215 ఉద్యోగ ఖాళీలు ఉండగా సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని సమాచారం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం జులై 18వ తేదీన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Back to top button