ఆరోగ్యం/జీవనం

మిరియాలతో సులభంగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?

మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి వంటకాలలో మిరియాలను వాడుతున్నామనే సంగతి తెలిసిందే. మిరియాల వల్ల వంటలకు చక్కని రుచి రావడంతో పాటు ఘాటును కోరుకునే వాళ్లు కారానికి బదులుగా మిరియాలను వాడే అవకాశం ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మిరియాల వల్ల సులభంగా బరువు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు రెండు తమలపాకుల్లో మిరియాలను పెట్టి నమిలి మింగితే మంచిది.

గ్లాస్ గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి పరగడుపున తాగేవాళ్లు బరువు సులభంగా తగ్గే అవకాశం ఉంటుంది. బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను నీటిలో కలుపుకుని పరగడుపున తాగినా మంచి ఫలితం ఉంటుంది. అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసిన గ్రీన్ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అర కప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌ లను తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపినా మంచి ఫలితం ఉంటుంది.

రోజూ ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టడంతో పాటు శరీరంలోని చెడు కొవ్వును కరిగించుకోవడం సాధ్యమవుతుంది. అర్థరైటిస్ తో బాధ పడేవాళ్లు మిరియాలను తీసుకుంటే మంచిది. జీర్ణాశయ సమస్యలతో బాధ పడే వాళ్లు మిరియాలతో ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో నల్ల మిరియాలు తోడ్పడతాయి.

గర్భవతులు మాత్రం నల్ల మిరియాలకు దూరంగా ఉంటే మంచిది. నల్ల మిరియాలు కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడతాయి.

Back to top button