టాలీవుడ్సినిమా

‘దిల్ రాజు’ను ఇబ్బంది పెడుతున్న ‘వకీల్ సాబ్’ !


పవర్ స్టార్ తో సినిమా సెట్ అవ్వగానే, దిల్ రాజు తెగ సంతోష పడ్డాడు. మరి.. పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న మొదటి సినిమా, దిల్ రాజు బ్యానర్ లోనే కదా. కానీ ఆ సంతోషం సంబరం దిల్ రాజుకు ఎక్కువ రోజులు నిలవలేదు. కరోనా పుణ్యమా అంటా థియేటర్స్త్ రెంట్ రూపంలో అసలుకే మోసం వచ్చింది. దీనికితోడు ‘వకీల్ సాబ్’ కూడా దిల్ రాజను కాస్త ఇబ్బంది పెడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పనులు వేగవంతం అయ్యాయి. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ చేస్తోన్న సినిమా కావడంతో, వకీల్ సాబ్ కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడానికి దిల్ రాజు ముందుగా స్క్రిప్ట్ లో కోన్ని మార్పులు చేయించాడు.

Also Read: బాలయ్యకి మంచి హీరోయినే దొరికింది !

కానీ ఆ మార్పులను పవన్ అంగీకరించకపోవడంతో.. ఇక చేసేదేమి లేక ఒరిజినల్ పింక్ కథను అలాగే ఉంచి.. ఒకటి రెండు సీన్స్ వరకూ హీరోయిన్ ను యాడ్ చేసి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. అయితే షూట్ లో అనుకోని కారణాల వల్ల బడ్జెట్ పెరిగింది. దాంతో ఈ సినిమాకి దిల్ రాజు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చెయ్యక తప్పలేదు. అందుకే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేయాలని దిల్ రాజు టెన్షన్ పడుతూ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ షూటింగ్ ప్లాన్స్ పవన్ కళ్యాణ్ చేంజ్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ నెలలో షూట్ ను పవన్ క్యాన్సల్ చేసినట్టు సమాచారం.

తన సినిమాకి సంబంధించి ప్రతి అంశాన్ని స్వయంగా దిల్ రాజునే ప్లాన్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఒక్క వకీల్ సాబ్ విషయంలో అది సాధ్యం అయ్యేలా కనబడటం లేదు. పవర్ స్టార్ మీద దిల్ రాజుకి ఉన్న అభిమానంతో.. ఇప్పటివరకూ దిల్ రాజు సర్దుకునిపోతున్నాడని.. అయితే ఇలాగే రిలీజ్ విషయంలో, బిజినెస్ విషయంలో కూడా జరిగితే సినిమాకి నష్టం వస్తుందనే భయంలో రాజు ఉన్నాడట. వసూళ్ళు పరంగా పవర్ స్టార్ సినిమాకి ఓపెనింగ్స్ బాగుంటాయి.. కానీ వకీల్ సాబ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, కాబట్టి ఓవర్ బడ్జెట్ అయితే.. లాస్ తప్పదు.

Also Read: వైరల్ అవుతోన్న ‘సుమ’ వీడియో !

ఏమైనా వకీల్ సాబ్, దిల్ రాజును బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 80% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పైగా ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనుంది.

Back to top button