టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఎదురులేని వ‌కీల్ సాబ్.. ప‌క్క‌కు జ‌రిగిన ‌సినిమాలు!

Vakeel Saab
‘ఒక‌రికి నేను ఎదురెళ్లినా వారికే రిస్క్.. ఒక‌రు నాకు ఎదురొచ్చిన వారికే రిస్క్’. ఇదీ.. లెజెండ్ సినిమాలోని డైలాగ్‌. ఈ డైలాగ్ రియ‌ల్ లైఫ్ లో ప‌వ‌న్ కు అప్లై చేయాల్సిన ప‌రిస్థితి. ప‌వ‌ర్ స్టార్‌ సమ్మర్ లో వచ్చేస్తున్నాడని ప్రకటించగానే.. రావాల్సిన సినిమాలన్నీ అలర్ట్ అయ్యాయి. వకీల్ సాబ్ రిలీజ్ డేట్ చూసుకొని తమ స్లాట్ బుక్ చేసుకున్నాయి.

ప‌వ‌న్ సినిమా రిలీజ్ రోజున.. మ‌రో సినిమా విడుద‌ల చేసేందుకు ఎవ్వ‌రూ ధైర్యం చేయ‌లేదు. వారం త‌ర్వాత ప్లాన్ చేసుకున్నారు. కానీ.. వ‌కీల్ సాబ్ తిరుగులేని విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని తేలిపోవ‌డంతో ఆ వారం నుంచి కూడా సినిమాలు త‌ప్పుకుంటున్నాయి.

లాక్ డౌన్ త‌ర్వాత ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం మొద‌లైన‌ప్ప‌టికీ.. పూర్తిస్థాయిలో నిండిన దాఖ‌లాలు లేవు. వ‌కీల్ సాబ్ క‌న్నాముందు వ‌చ్చిన చిత్రాలు విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టికీ.. ఆడియ‌న్స్ క్రౌడ్ పూర్తిస్థాయిలో క‌నిపించ‌లేదు. కానీ.. వ‌కీల్ సాబ్ కు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప‌వ‌ర్ స్టార్ సినిమా చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. చాలా థియేట‌ర్లు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి.

ఇక‌, వ‌కీల్ సాబ్ హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో.. ప‌వ‌ర్ స్టార్‌ ప్ర‌భంజనానికి ఎదురేలేద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లోనే వ‌చ్చే వారం రావాల్సిన శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరీ వాయిదా ప‌డింది. క‌రోనా కార‌ణంగా చెబుతున్న‌ప్ప‌టికీ.. అస‌లు కార‌ణం వ‌కీల్ సాబ్ అని అంటున్నారు.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే విడులైన వైల్డ్ డాగ్‌, రంగ్ దే వంటి సినిమాల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంద‌ని టాక్‌. వ‌కీల్ సాబ్ రాక‌తో ఆ సినిమాల‌వైపు జ‌నాలు క‌న్నెత్తి చూడ‌ట్లేద‌ని అంటున్నారు. దీంతో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కూడా అవ‌స్థ‌లు ప‌డుతున్నాయ‌ని స‌మాచారం. వీటి ప‌రిస్థితి ఇలా ఉండ‌డం.. వ‌చ్చే సినిమాలు వాయిదా ప‌డ‌డంతో.. ప‌వ‌ర్ స్టార్ వ‌చ్చే వారం కూడా ఎదురులేద‌ని అంటున్నారు.

Back to top button