టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా రివ్యూస్సినిమా వార్తలు

వకీల్ సాబ్ ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శ్రుతి హాసన్ జంటగా నటించిన కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ‘వకీల్ సాబ్’ఏప్రిల్ 9 న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ మూవీపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా సెన్సార్ చూసి స్పందించాడు.తన ట్విట్టర్‌లో వకీల్ సాబ్‌ కు ఏకంగా 4/5 గా రేటింగ్ ఇచ్చాడు.

యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు.. ఇండియన్ సినిమా మ్యాగజైన్ యుకె & యుఏఈ ఎడిటర్ ఉమైర్ సంధు తాజాగా వకీల్ సాబ్ సెన్సార్ చూసి ట్విట్టర్ ద్వారా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ మూవీపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి ఎక్స్‌క్లూజివ్ ఫస్ట్ రివ్యూ వకీల్ సాబ్! స్టార్ నటీనటుల నుంచి శక్తివంతమైన ప్రదర్శన అద్భుతం. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలా శక్తివంతమైన సందేశాన్ని ఎత్తిచూపిస్తున్నందుకు వకీల్ సాబ్‌ సినిమాను అస్సలు మిస్ కాకండి. ” అని ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.

పిఎస్ వినోద్ వకీల్ సాబ్ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించాడు. దీనికి ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్ నటించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.79.35 కోట్లు (ప్రీ రిలీజ్ బిజినెస్) వసూలు చేసింది.

దిల్ రాజు -బోనీ కపూర్ ’ప్రొడక్షన్ హౌస్ లు కలిసి వకీల్ సాబ్ నిర్మించారు. బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. ఇందులో బిగ్ బి అకా అమితాబ్ బచ్చన్ మరియు తాప్సీ పన్నూ ప్రధాన పాత్రల్లో నటించారు.

Back to top button