బాలీవుడ్సినిమా

కంగనా మీదికి  వర్మ ‘శశికళ’ కత్తి

Ram Gopal Varma

మనుషులందరిలో అతను ఓ వింత జీవి.. అందుకే అతడికి ఓ ప్రత్యేకత ఉంది. అదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని. అలాంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసినా సరే.. చివరికి ఒక మాట మాట్లాడినా సరే అది ఖచ్చితంగా వివాదం అవుతుంది..

Also Read: ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

అయితే ఇప్పడు దేనికైనా రెడీ అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. కంగనా రనౌత్‌తో పెట్టుకోవడానికి  అందరూ భయపడుతుంటారు. కానీ ఆమెతో కయ్యానికి సై అంటున్నాడు వర్మ. వర్మ కత్తి తీస్తున్నది బాక్సాఫీస్ యుద్ధానికి అని తెలుస్తోంది.

 కంగనా జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు.

Also Read: పెళ్లికి రెడీ అంటున్నా.. బుల్లితెర రాములమ్మ

ఆ సినిమాకు పోటీగా తన ‘శశికళ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా వర్మ ఎప్పుడో సినిమా ప్రకటించాడు. మధ్యలో దాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు.

Back to top button