టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఆ యంగ్ హీరోనే ఫాలో అవుతోన్న హీరోలు !

Varun Tejకరోనా సెకెండ్ వేవ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తమ షూటింగ్ లను తప్పక రద్దు చేసుకున్నారు సినిమా వాళ్ళు. ఎలాగూ షూటింగ్ లు లేవు, ఇక హీరోలకు ఏం చేయాలో ? ఎలా టైం పాస్ చెయ్యాలో అర్ధం కావడం లేదట. టూర్స్ వేయలేరు, పార్టీలు చేసుకోలేరు, మొత్తానికి ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక సతమతమవుతున్నారట కొంతమంది హీరోలు.

అయితే యంగ్ హీరోలు మాత్రం తమ సమయాన్ని పూర్తిగా జిమ్ లేక్ కేటాయించేశారు. లక్కీగా, గతేడాదిలా ప్రస్తుతం జిమ్ములు బంద్ కాలేదు కాబట్టి, తమకు ఆ రకంగా బాడీ బిల్డింగ్ మంచి అవకాశం దొరికిందని హీరోలు ఫీల్ అవుతున్నారు. దాంతో ప్రతిరోజూ జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ లు చేసుకుంటూ తమ ఫిట్నెస్ ని బిల్డ్ చేసుకుంటూ సిక్స్ ప్యాక్ కోసం, లేదా ఉన్న ప్యాక్ లను కాపాడుకుంటూ ఎక్కువుగా జిమ్ లోనే టైం పాస్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఏ హీరోని తీసుకున్నా ఎక్కువ టైం జిమ్ లోనే స్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ దాదాపుగా ప్రతిరోజూ జిమ్ లోనే ఏకంగా పది గంటల పాటు స్పెండ్ చేస్తున్నారట. కావూరి హిల్స్ లోని లైఫ్ స్టూడియో జిమ్ లోనే ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎక్కువగా ఉంటున్నాడు. వరుణ్ తేజ్ అంత డెడికేటెడ్ గా వర్కౌట్స్ చేస్తుండటం చూసి మిగతా యంగ్ హీరోలు కూడా వరుణ్ తేజ్ ను ఫాలో అవుతున్నారు.

కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’, ‘ఎఫ్ 3’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘గని’ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి చేసుకుంది. అలాగే ‘ఎఫ్ 3’ సినిమా కూడా కీలకమైన పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. అందుకే అనుకున్న డేట్స్ కి ఈ సినిమాలు రిలీజ్ కావట్లేదు. రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్నాయి. ఇప్పుడు కొత్త డేట్స్ వెతుక్కోవాలి.

Back to top button