జనరల్ప్రత్యేకం

రూ.10కే ఘుమఘుమలాడే బిర్యానీ.. ఎక్కడంటే?

Rs 10 Veg Biryani In Hyderabad.

సాధారణంగా బిర్యానీ ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు కనీసం 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుందనే సమాధానం వినిపిస్తుంది. పెద్దపెద్ద రెస్టారెంట్లలో బిర్యానీ ధర ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే హైదరాబాద్ లో మాత్రం బిర్యానీ కేవలం 10 రూపాయలకే లభిస్తోంది. నగరంలోని అఫ్జల్‌గంజ్ లో ఇఫ్తికార్ మొమిన్ అనే వ్యక్తి 10 రూపాయలకే బిర్యానీని విక్రయిస్తున్నాడు.

Also Read: నెలకు రూ.1,900 చెల్లిస్తే కొత్త స్కూటర్ పొందే ఛాన్స్..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ లో ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో అఫ్జల్ గంజ్ కూడా ఒకటి. హోల్ సేల్ షాపింగ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ల కోసం పదేళ్ల క్రితం ఇఫ్తికార్ మొమిన్ హోటల్ ను ఏర్పాటు చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇఫ్తికార్ మొమిన్ ఒకే రుచితో బిర్యానీని అందిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: మెట్రో రైళ్లలో ఆ సీట్లలో కూర్చుంటే రూ.100 జరిమానా..?

ఇఫ్తికార్ మొమిన్ బిజీగా ఉండే సెంటర్‌ను తన హోటల్ పాయింట్‌గా ఎంచుకుని వేడివేడి వెజిటేబుల్ బిర్యానీని అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు. అఫ్జల్‌గంజ్ బస్టాప్ సమీపంలో అస్కా బిర్యానీ స్టాల్ పేరుతో ఇఫ్తికార్ మొమిన్ హోటల్ ను ఏర్పాటు చేశాడు. హోటల్ ను ప్రారంభించిన కొత్తలో ఇఫ్తికార్ మొమిన్ 5 రూపాయలకే బిర్యానీని విక్రయించేవారు. నిత్యావసర సరుకులు, ఖర్చులు పెరగడంతో బిర్యానీ ధరను పది రూపాయలకు పెంచాడు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అస్కా బిర్యానీ స్టాల్స్ ను నగరంలోని కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సమీపంలో కూడా ప్రారంభించినట్టు ఇఫ్తికార్ మొమిన్ వెల్లడించారు.

Back to top button