బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

42 ఏళ్ల వయసులో కూడా.. డర్టీ పిక్చర్ చూపిస్తోంది !

vidya balan
అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన హీరోయిన్ కి నిజంగా సమాజంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా గౌరవం ఇవ్వరు. అందుకే, ఎక్స్ పోజింగ్ విషయంలో బోర్డర్స్ దాటిన ప్రతి హీరోయిన్.. ఎన్నో అవమానాలకు, అవహేళనలకు గురైన వారే. కానీ ఒక్క విద్యాబాలన్ విషయంలోనే అనుకుంటా.. బోల్డ్ రోల్స్ లో లిమిట్స్ క్రాస్ చేసినా, విద్యాబాలన్ కి సమాజంలో మంచి నటిగానే గుర్తింపు వచ్చింది. వల్గారిటీ హీరోయిన్ గా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. బాలీవుడ్ లో నటిగా ఏకంగా డర్టీ పిక్చర్ సినిమా చేసిన తరువాత కూడా, ఆమె పై ఆ బోల్డ్ ప్రభావం పడలేదు అంటే.. విద్యాబాలన్ అదృష్టమే అది. అసలు విద్యాబాలన్ కి డర్టీ పిక్చర్ బాగా ప్లస్ అయింది కూడా.

నిజానికి డర్టీ పిక్చర్ మొదలుకాకముందు ఆమె ఆ సినిమా చేయడం ఏమిటా అన్న సందేహాలు ఎక్కువయ్యాయి అప్పట్లో. అయితే అనుకున్నట్టుగానే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. డర్టీ పిక్చర్ లో నటించి తన విశ్వరూపం చూపించి రసిక హృదయాలను రొమాంటిక్ కలల ప్రపంచంలో విహరింప చేసింది. ఆ సినిమా తరువాత విద్యాబాలన్ కి బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఓ బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీ.. ఆ తరువాత మాత్రం అన్ని హౌస్ వైఫ్ పాత్రల్లోనే నటించి.. మొత్తానికి తన భర్తకు ఊరటను కలిగించింది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో గాని, విద్యాబాలన్ ఇప్పుడు కొత్తగా గ్లామర్ ను ఒలకబోయటానికి సిద్ధం అవుతుందట.

అసలు విద్యా బాలన్ ఫోకస్ మళ్ళీ గ్లామర్ వైపు పడుతుందని తెలిస్తే.. దర్శకనిర్మాతలు ఆమె చేత ఐటమ్ సాంగ్స్ చేయించడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. విద్యాబాలన్ నిజంగా ఐటమ్ సాంగ్ చేస్తే.. ఆ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. విద్యా ఓ మ్యాగజిన్ కోసం తాజాగా అందాలు ఆరబోసింది. మొత్తానికి తనలో ఇప్పటికీ ఎక్కడా గ్లామర్ తగ్గలేదని.. మరోసారి రసిక రాయుళ్ళ పై మన్మధ బాణాలు వేయడానికి తానూ సర్వం సిద్దమే అని మేకర్స్ కి క్లారిటీ ఇచ్చేందుకే.. హాట్ ఫోటో షూట్ లు చేస్తోందేమో. ఏది ఏమైనా విద్యా బాలన్ 42 ప్లస్ వయసులో కూడా ఏమాత్రం సడలని గ్లామర్ తో రెచ్చిపోవడం విశేషమే.

Back to top button