టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

రాజమౌళి, సుకుమార్ లకు చెప్పి విసుగొచ్చింది: విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad, Sukumar, సినిమా పరిశ్రమలో అగ్రదర్శకుల్లో రాజమౌళి, సుకుమార్ ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో అగ్ర దర్శకుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి వైఖరిలో కూడా మార్పు వస్తోంది. సుకుమార్, రాజమౌళి అంటే పరిశ్రమలో అందరికి గౌరవమే. మంచి స్నేహితులుగా మెలిగే వీరికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక వినూత్నమైన వ్యాఖ్య చేశారు. సుకుమార్, రాజమౌళి మధ్య స్నేహం ఈణాటికి కాదు 15 ఏళ్ల క్రితం నుంచి ఉంది. సినిమాల విషయంలో ఇద్దరు కూడా ఒకే తీరుగా వ్యవహరిస్తారని టాక్.

సుకుమార్ జగడం సినిమా అపజయం చెందడంతో కుంగిపోవద్దని రాజమౌళి సలహా ఇచ్చాడు. తరువాత తీసే సినిమాపై పూర్తి విశ్వాసం ఉంచు అని సలహా ఇవ్వడంతో సుకుమార్ కు ధైర్యం వచ్చింది. మహేష్ బాబుతో తీసిన వన్ నేనొక్కడినే తీసే సమయంలో కూడా రాజమౌళి సుకుమార్ కు తనవంతు సహాయం చేశాడు. ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో తక్కువ సమయంలోనే చాలా దగ్గరయ్యారు.

సినిమాలే కాకుండా కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగినా ఇద్దరు పరస్పరం వెళ్లి కలుసుకోవడం అలవాటు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ ఇద్దరి స్నేహంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా మేకింగ్ లో ఇద్దరు నిబద్దతతో వ్యవహరిస్తారని చెప్పారు. ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వారి మనస్తత్వాల గురించి చెప్పారు.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్ సన్నివేశం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుందని అన్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేస్తుందన్నారు. సినిమా విడుదల విషయానికి వస్తే మొదట ఆగస్టులోనే విడుదల చేయాలని అనుకున్నా కరోనా ప్రభావంతో వాయిదా పడుతోంది. సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Back to top button