టాలీవుడ్సినిమా

చైతు సినిమా పై రాతలు.. మేకర్స్ కి చిరాకు !


క్రియేటివిటీలో కాస్త గట్టి విషయం, నమ్మకమైన విశ్వసనీయత ఉన్న డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీ మెంబర్లకు ఆప్తుడు అయిపోయాడు విక్రమ్. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాన్ని కూడా రూపొందించి.. అఖిల్ కి హిట్ ఇవ్వాలని శాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఓ సినిమాని తెర‌కెక్కించబోతున్నాడు. అయితే ఎప్పుడూ సొంత క‌థ‌లుతోనే సినిమా తీసే విక్ర‌మ్, ఈ సారి చైతుతో చేసే సినిమాకి క‌థ మాత్రం విక్ర‌మ్ రాయ‌లేద‌ట, హిట్ లేని రైటర్ బివిఎస్ రవి, దిల్ రాజు జ‌మానాలో రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను విక్రమ్ తీసుకుని త‌న స్ట‌యిల్‌లో మార్పులు చేసుకుంటున్నాడట.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

అయితే ఈ సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. వాటిలో బాగా వైరల్ అయిన న్యూస్ ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ లా ఉండబోతుందని.. అయితే చైతుతో తన చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదని, రొమాన్స్ మరియు కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్ అని విక్రమ్ ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు. అయినా సినిమా పై రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. రోజూ ఈ సినిమా అలా ఉండబోతుంది ఇలా ఉంటుంది అంటూ లేనిపోని రాతలతో మేకర్స్ కి కూడా చిరాకు పుట్టిస్తున్నారు రూమర్ల క్రియేటర్స్.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

మొత్తానికి చైతు – విక్రమ్ సినిమా పై సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ అన్ని ఫేక్. ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Back to top button