వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: పవన్ కు కరోనా అని తెలిసి బోరుమన్న నటి

Viral: Ashureddy cried knowing that Pawan is Corona

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా అని తెలిసి ఆయన అభిమాన సంద్రం కన్నీటి సంద్రమవుతోంది. పవన్ కు కరోనా అని తెలియగానే అభిమానులంతా ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెడుతున్నారు. తెలుగురాష్ట్రాలే కాదు.. విదేశాల్లో ఉన్న పవన్ ఫ్యాన్స్ సైతం ఆయనకు కరోనా అని తెలియగానే కోలుకోవాలని పూజిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్ ఫేం, నటి ఆశురెడ్డి సైతం పవన్ కళ్యాణ్ కు కరోనా అని తెలియడం.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలు చూసి కలత చెందింది. ఆయన కోలుకోవాలని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కోరుకుంటూ బోరున ఏడ్చేసింది.

ఆశురెడ్డికి పవన్ అంటే పిచ్చి అభిమానం. ఇటీవల పవన్ తో కలిసి నటించిన ఆమె పవన్ తో సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. పవన్ కు నాలుగో భార్యగా రావడానికి తాను రెడీ అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఇంత బోల్డ్ గా పవన్ కు నాలుగో భార్యగా వస్తానన్న ఆశురెడ్డిపై అందరూ ఆడిపోసుకున్నారు. నెటిజన్లు కామెంట్ చేశారు.

కానీ ఆశు మాత్రం తనకు పవన్ అంటే పిచ్చి అభిమానం అని.. ఆయన పక్కన భార్యగా రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన మాటలను కవర్ చేసుకుంది. ఈ క్రమంలోనే పవన్ కు కరోనా అని తెలిసి సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమైంది. పవన్ త్వరగా కోలుకోవాలని.. అందరూ పవన్ కోసం ప్రార్థించాలని ఆశు పిలుపునిచ్చింది.

ఆశురెడ్డి ఇన్ స్టాగ్రామ్ వీడియో

Back to top button