వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: ‘ఉప్పెన’ మేకింగ్ లో కృతి లుక్

Viral: Krithishetti look at ‘Uppena’ making

ఉప్పెన మూవీతో కుర్రకారు గుండెలను పిండేసింది కృతి శెట్టి. ఆ సినిమాలో కృతి అందచందాలకు ఫిదా కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి కాదు. కన్నడ నుంచి వచ్చిన ఈ అందమైన భామకు తెలుగులో సీన్లు చెప్పడానికి డైరెక్టర్ బుచ్చిబాబు బాగానే కష్టపడ్డాడని తెలుస్తోంది.

తాజాగా ఉప్పెన సినిమా షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోలను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ బుచ్చిబాబు పాపం ఈ కృతికి ప్రతీసీన్ తను నటిస్తూ వివరిస్తున్న వైనం ఆకట్టుకుంది.

ఈ సినిమా కరోనాతో తర్వాత రిలీజ్ అయిన తొలి మూవీ. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లతో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోలను చిత్రం యూనిట్ పంచుకుంది. ఈ సందర్భంగా తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి, నటించడానికి కృతి తెగ కష్టపడిందని అర్తముతోంది.

Back to top button