క్రీడలువైరల్

వైరల్ మీమ్: లగాన్ ను అనసరిస్తున్న పంత్

Viral meme: Pant following Lagan

రిషబ్ పంత్.. భారత్ కు దూకుడుగా విజయాలను అందిస్తున్న ఈ క్రికెటర్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడంలో పంత్ అసాధారణ బ్యాటింగ్ అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ పంత్ అదే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అలరిస్తున్నాడు. పంత్ దూకుడుపై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సరదా మీమ్ పంచుకుంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘లగాన్’ సినిమాలో జ్యోతిష్యుడు పాత్రధారి బ్యాటింగ్ ను రిషబ్ పంత్ తో పోల్చింది. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ‘లగాన్’ మూవీని విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మీమ్ పోస్ట్ చేసింది.

లగాన్ సినిమాలో బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియక ఓ జ్యోతిష్కుడు ఎదురుగా నిలబడి బంతి ఎటువైపు వచ్చినా అటు వైపు కొడుతూ చిత్ర విచిత్రమైన బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ను అలాగే భారీ షాట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ రెండు ఫొటోలను మీమ్ గా తయారు చేసి ఢిల్లీ క్యాపిటర్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘లగాన్ కు 20 ఏళ్లు. ఆ గొప్ప వారసత్వాన్ని రిషబ్ పంత్ కొనసాగిస్తూనే ఉన్నాడు’ అంటూ ఓ కామెంట్ జత చేసింది. ఐపీఎల్ లో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ ఉన్న సంగతి తెలిసిందే.

Back to top button