వైరల్సినిమా

వైరల్: పెళ్లి తర్వాత తొలి ఫొటో.. రానా-మిహీక హనీమూనా?

Viral: Rana-Mihika first photo after marriage .. Honeymoon?

అత్యంత క్లిష్టమైన కరోనా టైంలో పెళ్లి చేసుకున్నాడు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా పేరొందిన హీరో రానా. తన స్నేహితురాలు మిహీకాను కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్యనే మనువాడాడు. చాలా తక్కువ టైంలోనే ప్రేమ పెళ్లి ప్రకటించి మూడు ముళ్లు వేసేసి ఓ ఇంటివాడై బ్యాచ్ లర్ లైఫ్ కు స్వస్తి పలికారు.

Also Read: విశాఖకు నో.. హైదరాబాద్ కే జై.. ‘మెగా’ స్టూడియోకు చిరంజీవి శ్రీకారం?

తాజాగా శనివారం వీకెండ్ లో రానాతో కలిసి తీసుకున్న ఓ రోమాంటిక్ ఫొటోను మిహీక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘ఇప్పుడే ఎందుకంటే’ అంటూ రానాను ట్యాగ్ చేశారు. ప్రేమతో కూడిన ఎమోజీలు జోడించారు.

ఈ ఫొటోలో రానా, మిహీకా చాలా రోమాంటిక్ గా కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కామెంట్లు వెల్లువెత్తాయి. ‘భళ్లాలదేవుడు హనీమూన్ కు వెళ్లాడా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఈ ఫొటోలో కొత్త జంటగా విరహా వేదనలో ఉన్నట్టు మరికొందరు కామెంట్స్ చేశారు.

Also Read: ఐదు రోజుల్లో ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు !

కరోనా లాక్ డౌన్ కావడంతో రానా-మిహీకా విహారయాత్రకు వెళ్లలేదని సమాచారం. వీకెండ్ కావడంతో సరదాగా దేశంలోనే ఓ చోటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హనీమూన్ కు కరోనా పూర్తయ్యాక హానీమూన్ కు వెళుతారని తెలుస్తోంది.

Back to top button