అత్యంత ప్రజాదరణవైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: సమంత హాట్ ఫోజు.. ఇలా షాకిచ్చింది

సాధారణంగా పెళ్లికి ముందు హీరోయిన్లు ఎంత ఎక్స్ పోజింగ్ ఇచ్చినా చూస్తారు… దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ పెళ్లి అయ్యాక కూడా అంతే తగ్గకుండా అందాలు ఆరబోస్తే.. మొగుడు ఊరుకోడా? ఫ్యాన్స్ ఊరుకుంటారా? పైగా పద్ధతి గల కుటుంబంలోకి వెళ్లాక ఏమైనా కట్టుబాట్లు ఉంటాయా? అంటే అవేవీ నాకు పనిచేయవు అంటోంది సమంత

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత నాగాచైతన్యతో పెళ్లి అయ్యి సంవత్సరాలు గడిచినా తన స్వేచ్ఛను వదులుకోలేదు. అంతే రోమాంటిక్ గా కనిపిస్తోంది. బీచ్ లలో.. ఫొటో షూట్ లలో కనిపిస్తూ అందచందాలను ఆరబోస్తోంది.

తాజాగా సమంత ఒక ఫొటో షూట్ లో పాల్గొంది. బంగారు రంగు గౌను వేసుకొని .. జుట్టు విరబోసుకొని నాజూకు అందాలు చూపిస్తూ గడ్డి పరకల్లాంటి దారాలు కిందకు జారుతుండగా ప్రియుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న లుక్ లో సమంత ఫిదా చేస్తోంది.

పెళ్లికి ముందు ఎంత గ్లామర్ గా ఉందో.. పెళ్లి అయ్యాక కూడా అంతే గ్లామరస్ గా సమంత సినీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. పెళ్లి అయ్యాక మరింత జోష్ పెంచింది అనేవారు లేకపోలేదు. సమంత ఇన్ స్టాగ్రామ్ పిక్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Back to top button