ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలువైరల్

వైరల్ వీడియో: పార్టీ లేదు..బొక్క లేదు: టీడీపీపై అచ్చెన్న ఘాటు వ్యాఖ్యలు

Viral video: Achennayudu harsh comments on TDP

తిరుపతి లోక్ సభ సాక్షిగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన సన్నిహితులతో పార్టీ పరిస్థితి.. లోకేష్ దుస్థితిపై మాట్లాడిన సీక్రెట్ వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఓ టీడీపీ నేతతో సాగించిన రహస్య సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు, లోకేష్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దారుణ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది.

కాగా ఈ వీడియో క్లిప్పింగులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేసి దుమారం రేపారు.

టీడీపీని నమ్ముకొని కట్టుబట్టలతో మిగిలానని.. తన బాధలను నారా లోకేష్ తో చెప్పుకోగా.. సూసైడ్ చేసుకోమని సలహా ఇచ్చాడని ఓ టీడీపీ నేత స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో వాపోయారు. దీనికి అచ్చెన్నాయుడు ‘ఆయనే సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సముదాయించడం ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది.

ఇక 17వ తేదీ తర్వాత తిరుపతి ఉప ఎన్నిక ముగిశాక అందరం ఫ్రీ అయిపోతామని.. ఆ తర్వాత పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు అన్న డైలాగ్ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.

వీడియోలో అచ్చెన్నాయుడు వాయిస్ చిన్నగా వినిపించినప్పటికీ ఆయన టీడీపీ దుస్థితిని కళ్లకు గట్టినట్టు తెలుస్తోంది. లోకేష్ ఉండగా పార్టీ పైకి లేవడం కష్టమేనన్నట్టుగా వారి సంభాషణల్లో తేలింది. పార్టీపై, లోకేష్ పై నమ్మకం లేదనే నైరాశ్యం స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిలోనూ కనిపించిందని ఈ వీడియోలను బట్టి అర్తమవుతోంది.

మరి ఇవి నిజమైన వీడియోలా? లేక ఫేక్ వీడియోలా? వైసీపీ నేతలు విడుదల చేయడంతో దీనిపై బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై అచ్చెన్నాయుడు ఇంతవరకు స్పందించలేదు.

Back to top button