టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Vishwak sen : దెబ్బకు దిగివచ్చిన విశ్వక్ సేన్..!

యువ న‌టుడు విశ్వ‌క్ సేన్ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అత‌ని లేటెస్ట్ మూవీ ‘పాగల్’ రేపు (ఆగ‌స్టు 14) రిలీజ్ కాబోతోంది. ఎందుకొచ్చిన తంటా అనుకున్నాడేమోగానీ.. విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు దిగివ‌చ్చాడు. తాను అలా మాట్లాడ‌డాని కార‌ణ‌మేంటో చెప్పుకొచ్చాడు. ఇంత‌కీ.. అత‌ను ఏం మాట్లాడాడు? దేని గురించి ఇదంతా? అన్నది ఇప్పుడు చూద్దాం.

పాగల్ చిత్రానికి సంబంధించి ఈమ‌ధ్య‌నే ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఇలాంటి ఈవెంట్లు అంటేనే.. సినిమాల గురించి డ‌బ్బా కొట్ట‌డం అన్న‌ది అందరికీ తెలిసిందే. హీరోల‌ను, ద‌ర్శ‌కుల‌ను ఆకాశానికి ఎత్తేసే ప్రోగ్రామ్ గా దీన్ని నిర్వ‌హిస్తుంటారు. ఇది సాధార‌ణ‌మే. అయితే.. ఒక అడుగు ముందుకేసి కామెంట్ చేసుకున్నాడు హీరో విశ్వ‌క్ సేన్‌. ‘‘ఈ సినిమా గ‌న‌క ఆడ‌క‌పోతే.. నా పేరు మార్చుకుంటా’’ అని ఒక స‌వాల్ విసిరాడు.

నెటిజ‌న్ల‌కు ఇంత‌క‌న్నా ఏం కావాలి? మ‌నోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. టాప్ హీరోలు కూడా ఎప్పుడూ ఇంత బిల్డ‌ప్ ఇవ్వ‌లేదు క‌దా సామీ? అంటూ కామెంట్లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇది చూసిన విశ్వ‌క్ సేన్ ఎందుకొచ్చిన తంటా అనుకున్నాడేమో.. కానీ దిగివ‌చ్చాడు. సినిమా ఒక‌వేళ ఆడ‌క‌పోతే.. ట్రోలిండ్ డోసు మ‌రింత పెరుగుతుంద‌ని భావించాడేమోగానీ.. వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

సినిమా విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు మీడియాతో మాట్లాడిన విశ్వ‌క్‌.. పాగ‌ల్ సినిమాపై త‌న‌కున్న న‌మ్మ‌క‌మే అలా మాట్లాడించింద‌ని చెప్పుకొచ్చాడు. చాలా మందికి ఈ సినిమా చూపించాన‌ని, ఇది చూసిన వాళ్లంతా సూప‌ర్ హిట్ అంటూ చెప్పార‌ని అన్నాడు. త‌న‌కు ఇండ‌స్ట్రీలో గాడ్ ఫాద‌ర్ ఎవ‌రూ లేర‌ని, సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేందుకు ట్రై చేస్తున్న‌ట్టు చెప్పాడు.

ఇక‌, రివ్యూల గురించి కూడా మాట్లాడాడు. రివ్యూ రైట‌ర్లు త‌న సినిమాల‌ను మోసేస్తుంటార‌ని అన్నాడు. ఫ‌ల‌క్ నామా దాస్‌, ఈ న‌గ‌రానికి ఏమైంది? సినిమాలు రెండూ మంచివేనని, కానీ.. రివ్యూలు చాలా తేడాగా వచ్చాయని అన్నాడు. ఈ సారి మరీ.. తనను అంతగా మోసేయొద్దని, పర్సనల్ ఎజెండాతో రివ్యూలు రాయొద్దని కూడా అన్నాడు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.

Back to top button