విద్య / ఉద్యోగాలు

తెలంగాణలో అంగన్‌వాడీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

WDCW Recruitment 2021

తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిజామాబాద్ జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 159 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతోంది. https://wdcw.tg.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎయిర్ ఫోర్స్ జాబ్స్..?

మొత్తం 159 ఉద్యోగ ఖాళీలలో మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్ల ఉద్యోగ ఖాళీలు 24 ఉండగా మినీ అంగన్ వాడీ టీచర్ల ఉద్యోగ ఖాళీలు 5, అంగన్ వాడీ హెల్పర్స్ ఉద్యోగ ఖాళీలు 130 ఉన్నాయి. కనీసం పదోతరగతి పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఏప్రిల్ 22 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా https://wdcw.tg.nic.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Also Read: డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. పరీక్ష లేకుండా జాబ్స్..?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button