టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మనమంతా కలిసే ఉన్నాం: తమన్నా

Tamannaసినిమా ఇండస్ట్రీల పై కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలానికి నటీనటులు కూడా అల్లాడిపోతున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా పెట్టిన ఒక పోస్ట్ చూస్తుంటే.. ఈ కరోనా కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ ను తీసుకునే యాక్టర్స్ ను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నట్లు ఉంది. ఇంతకీ తమన్నా పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. “కరోనా మానవజాతిని అనేక సమస్యల్లోకి నెట్టేసింది. కానీ మనం ఎవ్వరం మన ధైర్యాన్ని కోల్పోయే సమయం కాదిది. గుర్తుపెట్టుకోండి.

మనం పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లడం అవసరం. కరోనాని జయించగలం అనే నమ్మకంతో పోరాడండి, దేవుడి పై కృతజ్ఞతని కనబరచండి. అలాగే ఈ కష్ట సమయంలో మన తోటివారికి అలాగే ఇతరులకు కూడా, మనకు చేతనైనా తోడ్పాటును అందించడం మన విధి. ముఖ్యంగా కరోనా నివారణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొండి. మర్చిపోకండి… ఈ పోరాటంలో మనమంతా కలిసే ఉన్నాం’ అంటూ మిల్క్ బ్యూటీ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

మొత్తానికి ఈ పోస్ట్ తో తనని ఫాలో అయ్యేవారికి, తమన్నా ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఇక తమన్నా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ‘సీటీమార్’ సినిమా కరోనా సెకెండ్ వేవ్ రాకపోయి ఉంటే… ఈ పాటికే విడుదల అయి ఉండేది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో తమన్నా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తోంది.

పైగా కోచ్ గా కొన్ని రిస్క్ షాట్స్ ను కూడా తమన్నా, ఈ సినిమా కోసం చేసిందట. అందుకే తమన్నాకి సిటీమార్ ప్రత్యేక సినిమా అయింది. అటు తమన్నా కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది. కరోనా కల్లోలం వల్ల సిటీమార్ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం మరో మూడు నెలలు వరకూ ప్రస్తుత పరిస్థితే ఉండే అవకాశం ఉంది.

Back to top button