జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ప్రజారక్షణలో ఏ ప్రభుత్వం విఫలమైనా ఖండిస్తాం.. అసదుద్దీన్ ఓవైసీ

We condemn any government failure in public protection: Asaduddin Owaisi

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగుతున్న హింసాత్మక ఘటనలపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజల జీవించే హక్కును కాపాడటమే ప్రధాని విధి అయి ఉండాలని అసద్ సూచించారు. ఏ ప్రభుత్వమైతే ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతదో ఆ ప్రభుత్వం విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్టేనని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.  దేశంలో ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైనా ఆ ప్రభుత్వ వైఫలాన్ని తాము ఖండించి తీరుతామని ఆయన తెలిపారు.

Back to top button