ఆరోగ్యం/జీవనం

ఈ నీళ్లతో కిడ్నీలో రాళ్లకు సులువుగా చెక్.. ఎలా అంటే..?

Lemon Infused Water Benefits
photo flat lay or top view very small kidney stone at two finger at blue background

చిన్న వయస్సు వాళ్ల నుంచి పెద్ద వయస్సు వాళ్ల వరకు చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తుంది. మందులు వాడటం ద్వారా కొంతమంది ఈ సమస్యను అధిగమిస్తే మరి కొంతమంది మాత్రం ఆపరేషన్ చేయించుకుంటే మాత్రమే ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. అయితే నీళ్లు తాగడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల మలినాలు బయటకు పోతాయనే సంగతి తెలిసిందే.

Also Read: వెన్న తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా…?

సాధారణ నీళ్లు కాకుండా లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. నీళ్లకు నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల రుచి మారడంతో పాటు సాధారణంగా తాగే నీళ్లతో పోలిస్తే ఎక్కువ నీటిని తాగవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ లా పని చేస్తుంది.

Also Read: ఏసీ వాడుతున్నారా.. విద్యుత్ బిల్లు ఆదా చేసే చిట్కాలివే..?

విటమిన్ సి కార్డియో వాస్క్యులర్ డిసీజ్, గుండెపోటు వచ్చే రిస్క్ ను తగ్గించడంతో పాటు బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. నిమ్మకాయలలో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీర బరువును అదుపులో ఉంచుతాయి. నిమ్మకాయ లో ఉండే విటమిన్ సీ చర్మం ముడతల బారిన పడకుండా రక్షించడంతో పాటు సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు.

లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ డైజెస్టివ్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేయడంతో పాటు ఆహారాన్ని పూర్తిగా అరిగించడంలో తోడ్పడుతుంది. ఉల్లి, వెల్లుల్లి, చేపలు తిన్న తరువాత నోటి నుంచి వచ్చే ఒక రకమైన వాసనకు చెక్ పెట్టడంలో నిమ్మరసం తోడ్పడుతుంది.

Back to top button