ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ తొలగింపు విషయంలో ఆ పార్టీ అధిష్టానం దూకుడు ఎందుకు ప్రదర్శించిందనేది ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న. ఉన్న పళంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి నడ్డా ఉత్తర్వలు ఇచ్చారు. కన్నాపై కొద్ది రోజులుగా బిజెపి అదిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అదే ఆయనను తొలగించడానికి ముఖ్యకారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ నేతలు కొద్ది రోజుల కిందట ఒక ఆరోపణ చేశారు. చంద్రబాబు నుంచి రూ.20 కోట్లు కన్నాకు అందాయని, అందుకే కన్నా చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే కరోనా టెస్ట్ కిట్ లపై లేనిపోని రాద్ధంతం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇదే అంశాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

అంతే కాకుండా బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ రెండు పార్టీలను సమన్వయం చేయడంలో కన్నా వైఫల్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఏ కార్యక్రమాన్ని రెండు పార్టీలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించలేకపోయాయి. పవన్, కన్నా సమావేశం అవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి సందర్భాలు అసలు లేవు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. రాజధాని విషయంలో ముందు నుంచి మద్దతుగా కన్నా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరినప్పడు వాటిని ఆమోదించవద్దని కన్నా లేఖ రాశారు. ఈ వ్యవహారంపై అదిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా నిమ్మగడ్డ ను ఎస్ఇసిగా తొలగించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించినప్పడు కన్నా ఆ విషయంలో గవర్నర్ తీరును తప్పుబడుతూ లేఖ రాశారు.

Also Read: తుమ్మలకు మరోసారి అదృష్టం వరించనుందా?

మరోవైపు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో 2019 లో ఎన్నికల్లో బిజెపీ అధిక సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసింది, కాని ఒక్క సీటు సాధించలేకపోయింది. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థతి ఎక్కడా కనిపించలేదు. నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి బరిలో నిలిచిన కన్నా డిపాజిట్ కోల్పోయారు. దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తగా చతికలబడినట్లయ్యింది.

వాస్తవానికి కన్నాను పార్టీ అధ్యక్షుడిగా నియమించిన సమయంలో ముందు సోము వీర్రాజు పేరే వినిపించింది. పార్టీలో చేసేందుకు అధ్యక్ష పదవిని డిమాండ్ చేసిన కన్నా బీజేపీ అధిష్టానం అందుకు సిద్ధంగా లేకపోవడంతో వైసీపీతో సంప్రదింపులు జరిపి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చివరి నిముషంలో బీజేపీ నుంచి సానుకూల సమాచారం అందడంతో వైసీపీలో చేరకుండా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని నాటకం ఆడి చివరికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Tags
Back to top button
Close
Close