గుసగుసలుసినిమా

‘ఆకాశం నీ హద్దురా’ సడెన్ వాయిదా వెనుక కారణమెంటీ?

What is the reason behind the sudden postponement of 'Aakasam Nee Haddura'?

Aakasam Nee Haddura Postponed

తమిళ నటుడు సూర్య తాజాగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళంలో రిలీజ్ అవుతోంది. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ అవుతుండగా తమిళంలో ‘సూరారై పొట్రుగా’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీని అమేజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 30న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.

Also Read: జగన్ కు కేసీఆర్ కు అదే తేడా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..?

అయితే ఈ మూవీ సడెన్ గా వాయిదా పడింది. దీనికితోడు మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కూడా ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మూవీకి ఎయిర్స్ ఫోర్స్ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. వాటి కారణంగానే ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

‘ఆకాశం నీ హద్దురా’ మూవీ విమానయాన రంగానికి చెందిన కథ. దీంతో చిత్రబృందం సినిమాను నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో.. నిజమైన విమానాలతో చిత్రీకరణ చేశారు. దీనికోసం విమానయాన రంగం నుంచి.. దేశ భద్రతా విభాగం నుంచి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. దీనిలో భాగంగా చిత్రయూనిట్ అనుమతులు తీసుకొంటూ సినిమాను పూర్తి చేసింది.

ఇక ఈ సినిమా మే 1 రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించగా కరోనా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని థియేటర్లలో కాకుండా అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా విడుదలకు విమానశాఖ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉందని తెలుస్తోంది.

ఈ విషయంపై హీరో సూర్య స్పందిస్తూ ఈనెల 30న సినిమా విడుదల చేయడం లేదని.. వాయిదా వేస్తున్నట్లు ట్వీటర్లో ఓ లేఖను విడుదల చేశాడు. అభిమానులంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. మళ్లీ సినిమా విడుదలపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Also Read: చిరు మళ్లీ పుట్టాడు.. మగబిడ్డకు జన్మినిచ్చిన మేఘనారాజ్..!

మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని తెరకెక్కుస్తున్న ఈ మూవీలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తోంది. ఇందులో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో ఈ మూవీ కోసం సూర్య అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Back to top button