ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

చంద్రబాబు సంతోషానికి కారణమేంటి?

Chandrababu happinessఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఎదురీదుతోంది. పార్టీకి పీకల్లోతు కష్టాల్లో ఉంది. రాజకీయంగా అనేక ఇబ్బందులుపడుతోంది. వైసీపీ ధాటికి కుదేలైపోతోంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వారి మీదే వైసీపీ కేసులు పెడుతుండడంతో టీడీపీ నేతలు జంకుతున్నారు. కొండపల్లి మైనింగ్ పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆయనను వారం రోజుల పాటు జైలు పాలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు భయాందోళన చెందుతున్నారు. ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు నడవడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేదు. ఈ కారణంతో కార్యకర్తల్లో నైరాశ్యం కలుగుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీకి ఓ వార్త తీపి కబురులా అనిపించింది. ఇంతవరకు నియోజవర్గాల పెంపుపై అందరిలో ఆసక్తి నెలకొనగా కేంద్రప్రభుత్వం ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు ఉండదని తేల్చడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నియోజకవర్గాల పెంపు జరిగితే టీడీపీ నేతలందరు వైసీపీకి వలస వెళ్లేవారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బాబులో పట్టరాని ఆనంద పడుతున్నారు. పార్టీని ఇప్పుడైనా బలోపేతం చేయాలని భావిస్తున్నారు. నేతల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు టీడీపీ నేతలపై వైసీపీ నేతల వేధింపులు పెరిగాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలను ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకుంటున్నారు. ఇదే అదనుగా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలను అదుపులో పెట్టడంతో రాష్ర్టంలో వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ టీడీపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు ప్రణాళికలు రచించాల్సి ఉంది. వారిలో ధైర్యం నింపి ప్రభుత్వంపై ఎదురు తిరిగేలా తయారు చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వారిలోని లోపాలను ఎండగడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు కార్యోణ్ముఖులను చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

 

Back to top button