పండుగ వైభవంలైఫ్‌స్టైల్

సూర్యగ్రహణం ఏ సమయంలో చూడాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

2021 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం నేడు కాగా గ్రహణం కావడంతో నేడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈరోజు గ్రహణం మధ్యాహ్నం 1 తరువాత ప్రారంభం కాగా లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. సూర్య గ్రహణం యొక్క దృశ్యం అగ్నివలయంలా కనిపిస్తుంది.

నాసా ఇంటరాక్టివ్ మ్యాప్ ను ప్రారంభించగా ఈ ఇంటరాక్టివ్ మ్యాప్ తో సూర్యగ్రహణం భూమి ఉపరితలంపై ఎలా కదులుతుందో చూసే అవకాశం ఉంటుంది. మన దేశంలో గ్రహణం మధ్యాహ్నం 1.42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.41 వరకు ఉంటుంది. తూర్పు అమెరికా, ఉత్తర అలాస్కా, కెనడా, కరేబియన్, ఉత్తర ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలో పాక్షిక సూర్యగ్రహణం ఉంటుందని తెలుస్తోంది.

టైమండ్‌ డేట్.కామ్ వెబ్ సైట్ గ్రహణాన్ని ఆన్ లైన్ లో చూసే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. గ్రహణం సంభవించే సమయంలో సూర్యుని వైపు అస్సలు చూడకూడదు. అద్దాలు ఉపయోగించి సూర్యగ్రహణం చూస్తే మంచిది. పిన్‌హోల్ కెమెరా లేదా బాక్స్ ప్రొజెక్టర్‌ సహాయంతో కూడా గ్రహణాన్ని చూడవచ్చు. బైనాక్యులర్లు, టెలిస్కోప్ లేదా కెమెరా ద్వారా సూర్యగ్రహణాన్ని సంగ్రహించాలనుకుంటే లెన్స్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి, మృగశిర నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడనుండటంతో వీరిపై ప్రభావం ఉండనుందని తెలుస్తోంది. రష్యా, కెనడా, గ్రీన్ లాండ్ దేశాల్లో ఈ గ్రహణాన్ని సంపూర్ణంగా వీక్షించవచ్చు. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా అందులో రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఉండటం గమనార్హం.

Back to top button