అత్యంత ప్రజాదరణక్రీడలు

సన్‌‘రైజ్‌’ కావాలంటే మార్పులు చేయాల్సిందేనా?

What was the reason for Sunrisers Hyderabad's defeat?

2013లో డెక్కన్‌ ఛార్జర్స్‌ స్థానంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఏర్పాటైంది. నిలకడగా ఆడే జట్లలో ఇదీ ఒక జట్టు. ఏర్పాటైన ఏడాదే ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2016లో ఛాంపియన్స్‌గానూ నిలిచింది. 2017లో నాలుగోస్థానంలో, 2018లో రన్నరప్‌గా.. గతేడాది కూడా నాలుగోస్థానంలో నిలిచింది. అయితే.. ఈ సీజన్‌లో మాత్రం అంతగా రాణించినట్లుగా కనిపించడం లేదు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడితే.. కేవలం మూడింటనే గెలిచింది. ఆరు పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది.

Also Read: ధోనీలో ఫస్ట్రేషన్.. ఎందుకు సహనం కోల్పోతున్నట్లు..?

మరో ఆరు మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్‌.. ప్రతీ మ్యాచ్‌ కీలకమే కానుంది. ఒకసారి సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌‌ను ఓసారి పరిశీలిస్తే.. వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్ ముగ్గురూ విదేశీ క్రికెటర్లే. ఈ ముగ్గురు కూడా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లే. ఇక బౌలింగ్ లో చూసుకుంటే రషీద్ ఖాన్‌ రూపంలో మరో విదేశీయుడు అందుబాటులో ఉన్నాడు. ఆరంభంలో విలియమ్సన్‌‌ను పక్కన బెట్టి మార్ష్, నబీలను ఆడించినా.. చివరకు ఈ కివీస్ క్రికెటర్‌ను ఆడించక తప్పలేదు.

జట్టులో ఉన్నది ఒకేఒక్క భారత క్రికెటర్‌‌ మనీష్‌ పాండే. అతను కూడా భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడేం కాదు. మిడిలార్డర్ వైఫల్యాలను అధిగమించాలంటే.. ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రియమ్ గార్గ్ స్థానంలో విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, సంజయ్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు అవకాశం రావడం లేదు. విరాట్ సింగ్ హిట్టింగ్ చేయగలడు. కుదిరితే బెయిర్‌స్టోను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపి.. వార్నర్‌కు తోడుగా ఓ యువ బ్యాట్స్‌మెన్‌ను ఆడిస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీలో స్టార్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ లేకపోవడం.. ఆల్‌రౌండర్లు లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు.

Also Read: ఐపీఎల్ విజేత పోటీ: ఢిల్లీ కప్ సాధిస్తుందా?

ఫ్యాబెన్ అలెన్ రూపంలో ఓ ఆల్‌రౌండర్ ఉన్నా.. నబీ, అలెన్ లాంటి విదేశీ ఆల్‌రౌండర్లను ఆడించలేకపోతున్నారు. విజయ్ శంకర్‌ ఆల్‌రౌండరే అయినా ఆయనపై ఆధారపడే పరిస్థితి కనిపించడం లేదు. సన్‌రైజర్స్‌లో మిడిలార్డర్ సమస్యతోపాటు భువీ లేని లోటు కనిపిస్తోంది. వచ్చే సీజన్‌ వరకైన స్వదేశీ ఆటగాళ్లు రంగంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇటు భువీతోపాటు.. అటు రైనాతోపాటు హార్దిక్ పాండ్య లాంటి ఓ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Back to top button