జనరల్మొబైల్స్

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. మరో కొత్త ఫీచర్..?

WhatsApp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త ప్రైవసీ పాలసీ వల్ల ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మధ్య కాలంలో కొత్త ఫీచర్ల ద్వారా యూజర్లకు చేరువవుతున్న వాట్సాప్ వాట్సాప్ వెబ్ లేదా వాట్సాప్ డెస్క్ టాప్ వాడే కస్టమర్ల కొరకు మరో శుభవార్తను చెప్పింది. ఇకపై వాట్సాప్ యూజర్లు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ ద్వారా వాట్సాప్ లోకి లాగిన్ కావచ్చు.

Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. సెకన్లలో మూవీ డౌన్ లోడ్..?

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ల వెబ్ వాట్సాప్ ను ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయలేరు. ఇతరులు తమ కంప్యూటర్ కు మీ వాట్సాప్ ఖాతాకు లింక్ చేయకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుంది. ఫోన్‌లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్ లాక్ చేస్తే మాత్రమే వాట్సాప్ వెబ్ లేదా వాట్సాప్ డెస్క్ టాప్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ లాక్ చేసిన తర్వాత qr కోడ్ స్కానర్‌ను స్కాన్ చేసి వాట్సాప్ ను యాక్సెస్ చేయవచ్చు.

Also Read: యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సిగ్నల్ యాప్..?

వాట్సాప్ యూజర్ డేటాను రక్షించడం కోసం ఈ కొత్త ఫీచర్ ను తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా త్వరలోనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రైవసీ పాలసీ నిర్ణయాన్ని మూడు నెలలు వాయిదా వేసిన వాట్సాప్ మే నెలలో కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తీసుకురానుంది. అయితే కేంద్రం సైతం ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ పై విమర్శలు చేస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: మొబైల్స్

అయితే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉండటంతో యూజర్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వాట్సాప్ యాప్ నే మెసేజ్, వీడియో కాల్స్ కొరకు వినియోగిస్తూ ఉండటం గమనార్హం.

Back to top button