అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

ప్రభాస్ పెళ్లి గురించి అడగగానే కృష్ణం రాజు సీరియస్

పెళ్లాం పిల్లలు లేకుండా కెరీర్ మాత్రం తన భార్యగా భావిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ తో పాటు సాలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాపటానీనీ హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రారంభం

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ వివాహం జరుగుతుందని అందరూ అనుకున్నారు. మరోసారి సాహో తరువాత పెళ్లి విషయం గురించి ఆలోచిస్తానని చెప్పిన ప్రభాస్ ఇప్పడు రెండు మూడు కొత్త సినిమాలు చేస్తున్నాడు.

ఈ రోజు కృష్ణం రాజు 81 పుట్టిన రోజు సందర్భంగా లైవ్ చాట్ లో పాల్గొన్నారు. అయితే చిట్ చాట్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పడు అని అడగగా సీరియస్ అయ్యారు. వెంటనే తడుముకోకుండా చెప్పేశారు. షాక్ అయిన యాంకర్ ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్ ఎదురు చూస్తున్నారని అన్నారు.

Also Read: “లస్ట్ స్టోరీస్”కి గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే !

అయితే ప్రభాస్ పెళ్లి కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని కానీ అది ఎప్పుడు అంటే తాను చెప్పలేనని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి విషయంలో కృష్ణంరాజు సంతోషంగా లేరని కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారానికి సమాధానం దొరికినట్లయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button