అత్యంత ప్రజాదరణతెలంగాణప్రత్యేకంరాజకీయాలువైరల్

తెలంగాణ యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ?

స్వామి పరిపూర్ణానంద ఓటమి తర్వాత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. ఆయన బీజేపీ నిర్వహించే ఏ పార్టీ సమావేశానికి హాజరు కావడం లేదు.

ఉత్తరప్రదేశ్ కు యోగి ఆధిత్యనాథ్ సీఎం అయ్యాక.. ఇక బీజేపీలో చేరితే స్వాముల పంట పండినట్టేనని అందరూ అనుకున్నారు. ఈ మేరకు హిందుత్వ బీజేపీకి మద్దతుగా స్వాములు కదిలారు. యూపీ సీఎం యోగిలాగానే తాను కూడా తెలంగాణలో సీఎం అవ్వాలని చేరారు స్వామి పరిపూర్ణానంద కలలుగన్నాడు… చుక్కాని లేని నావలా ఉన్న బీజేపీని తనే నడిపిస్తానని అనుకున్నారు. కేసీఆర్ ధాటికి నిలవలేకపోతున్న కమళనాథులకు తనే ఆశాకిరణం అని మొదట్లో హల్ చల్ చేశారు. అదృష్టం కలిసివస్తే ఏకంగా తెలంగాణ సీఎం అవుదామని కలలు గన్నారు. కానీ ఇప్పుడు కనుమరుగైపోయారు.

Also Read: కేంద్ర విద్యుత్ చట్టాన్ని కడిగేసిన కేసీఆర్

స్వామి పరిపూర్ణానంద తనను తాను తెలంగాణకు యోగి ఆదిత్యనాథ్ అని చెప్పుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి తనకు మాత్రమే అర్హత ఉందని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. మొన్నటి ఎన్నికల వేళ బీజేపీ తరుఫున పలు బహిరంగ సభలలో ప్రజలకు హామీ కూడా ఇచ్చాడు. కానీ, బ్యాడ్ లక్.. స్వామి పరిపూర్ణ ప్రచారం పనిచేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎంత ప్రచారం చేసినా.. ఓట్లు లెక్కించినప్పుడు కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఈ యోగి వేగంగా అదృశ్యమయ్యాడు.

అమిత్ షా సమక్షంలో ఎంతో అభిమానుల మధ్య స్వామి పరిపూర్ణనంద బిజెపిలో చేరారు. తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలిలా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. తనను తాను తెలంగాణకు చెందిన యోగి ఆదిత్యనాథ్ అని పిలిచుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని కలలుగన్నాడు. కానీ, అదే స్వామి పరిపూర్ణానంద ఓటమి తర్వాత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. ఆయన బీజేపీ నిర్వహించే ఏ పార్టీ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అయిన తర్వాత పరిపూర్ణనందాను ఏ పార్టీ కార్యక్రమానికి హాజరు కావాలని అడగడం లేదు.

Also Read: కో‘దండమే’.. పోటీకి భయపడుతున్న కేసీఆర్?

ఏపీ ఎన్నికల ప్రచారానికి సైతం పరిపూర్ణానందను రావాలని బీజేపీ కోరినప్పుడు.. ఓటమి వల్ల నైరాశ్యంతో ఆయన ప్రచారం చేయలేదు. ఇప్పుడు స్వామిని ఎవరూ పట్టించుకోవడం లేదు.దీంతో ఒంటరిగా మిగిలిపోయాడు.. పరిపూర్ణనంద టీవీ ఛానల్ కూడా సరిగా నడవడం లేదట… చాలా మంది ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టారు.రోజులు గడిచేకొద్దీ ఆయన చానెల్ కు అప్పులు పెరుగుతున్నాయి. కాబట్టి, తెలంగాణకు చెందిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు తనకు తగిలిన గాయాలకు మందులు రాసుకుంటూ రాజకీయాలను వదిలిపెట్టినట్టే పరిస్థితి కనిపిస్తోందని బీజేపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.

Back to top button