వ్యాపారము

తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ను ఇస్తున్న బ్యాంకులివే..?

Banks Lowest Interest Rates On Home Loans

మనలో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న ఖర్చుల వల్ల సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్ వడ్డీ రేట్ల విషయంలో ఒక బ్యాంక్, మరో బ్యాంక్ వడ్డీరేట్ల మధ్య స్వల్పంగా వ్యత్యాసం ఉంటుంది.

హోమ్ లోన్ వడ్డీరేటు కొంచెం తగ్గినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో వడ్డీరేట్లకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర బ్యాంకులతో పోలిస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్‌ తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కేవలం 6.65 శాతం వడ్డీకే హోమ్ లోన్ ఇస్తుండటం గమనార్హం. ఈ బ్యాంక్ తరువాత ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 6.70 శాతం వడ్డీకి హోమ్ లోన్ ఇస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఇస్తుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ 6.80 శాతం వడ్డీరేటుకు లోన్ ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుండగా ఐడీబీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతం వడ్డీకి హోమ్ లోన్ వస్తుండటం గమనార్హం. కెనరా బ్యాంక్‌ 6.90 శాతం వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుండగా ఎస్బీఐ 6.90 శాతానికి హోమ్ లోన్ ఇస్తోంది.

ఎస్బీఐ 6.95 శాతం వడ్డీరేటుకు హోమ్ లోన్ ఇస్తుండగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదే వడ్డీరేటుకు హోమ్ లోన్ ఇస్తుండటం గమనార్హం. ఇతర లోన్లతో పోలిస్తే తక్కువ వడ్డీకే బ్యాంకులు హోమ్ లోన్లను ఇస్తుండటం గమనార్హం.

Back to top button