ఆరోగ్యం/జీవనం

ఆరోగ్యంగా ఉండటానికి ఏ బియ్యం మంచివో మీకు తెలుసా..?


కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల మనలో చాలామంది ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతిరోజు అన్నం ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే ఏ రైస్ తింటే మంచిదనే అవగాహన చాలామందికి ఉండదు. డయాబెటిక్ రోగులు, బరువు తగ్గాలని అనుకునే వాళ్లు ఆహారంలో కచ్చితంగా మార్పులు చేసుకుంటే మంచిది. మార్కెట్ లో తెల్ల బియ్యంతో పాటు ఎరుపు, గోధుమ, నలుపు బియ్యం కూడా అందుబాటులో ఉంది.

మనలో చాలామంది ఎక్కువగా తెల్ల బియ్యం వాడతారు. అధిక ప్రాసెసింగ్ వల్ల తెల్ల బియ్యంతో పోషక అంశాలు తగ్గి శరీరానికి తక్కువ మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. తెల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, థయామిన్, విటమిన్లతో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం, ఫోలేట్ లభిస్తాయి. పొట్టును మాత్రమే తొలగించే బ్రౌన్ రైస్ లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు బ్రౌన్ రైస్‌ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఎర్ర బియ్యంలో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ బియ్యం తీసుకుంటే మంచిది. క్యాన్సర్ కణాలను నివారించడంలో ఎర్ర బియ్యం తోడ్పడుతుంది.

గుండె, మధుమేహం రోగులకు ఎర్రబియ్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ రైస్‌ను పర్పుల్ రైస్ అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి. వైట్ రైస్ ను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Back to top button