ఆరోగ్యం/జీవనంలైఫ్‌స్టైల్

వంటల్లో ఉప్పు ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

మన దేశంలోని ప్రజలలో చాలామంది ఉప్పు ఎక్కువగా ఉండే వంటకాలను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. వంటలకు ఎన్ని మసాలాలు దట్టించినా ఉప్పు లేకపోతే వంట అస్సలు రుచిగా ఉండదు. అయితే ఉప్పు అధికంగా తీసుకుంటే మాత్రం ముప్పేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తుండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని చెబుతోంది.

డబ్ల్యూహెచ్‌ఓ గైడ్‌లైన్స్‌ ను ఈ మేరకు జారీ చేసింది. ఆహార పదార్థాలలో ఉప్పు కంటెంట్ ను తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం సరైన పోషణ లేకపోవడం వల్ల 11 మిలియన్ల మంది మరణిస్తుండగా వీరిలో 30 లక్షల మంది ఉప్పు వాడకం ఎక్కువ కావడం వల్ల మరణిస్తుండటం గమనార్హం.

డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలలో, తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో ఉప్పు వాడకం ఎక్కువగా ఉంది. తృణధాన్యాలు, ప్రాసెస్‌ చేసిన మాసం, జున్ను, రొట్టె, ఇతర ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి ఉప్పు చేరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండటం గమనార్హం. శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజం అయిన ఉప్పును పరిమితంగా తీసుకోవాలి.

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అధికారులు ప్రజలకు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయానికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని వెల్లడించారు.

Back to top button