క్రీడలుజాతీయంప్రత్యేకంరాజకీయాలు

ముంబై ఇండియన్స్ ఎందుకు అంత స్ట్రాంగ్?

Why are Mumbai Indians so strong in IPL?

ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన వన్డే, టీ20లో కీలకమైన ఫైనల్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీని పక్కనపెట్టి చివర్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్, బౌలింగ్ సెట్ చేశాడు. విరాట్ సైతం రోహిత్ శర్మ సలహాలు తీసుకున్నాడు. అందుకే ఈ రెండు ఫైనల్స్ లో ఇంగ్లండ్ చిత్తు అయ్యి భారత్ గెలిచింది. పరుగులు చేయడంలో తోపు అయిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ విషయంలో మాత్రం వీక్. ఎందుకంటే కోహ్లీ ప్రాతినిధ్యంలో టీమిండియా ఒక్క ప్రపంచ కప్ గెలవలేదు. ఇక ఐపీఎల్ లో కోహ్లీ కెప్టెన్సీలో బెంగళూరు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు.

అదే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా మధ్యలో అద్భుత విజయాలు సాధించాడు. అలాగే ముంబైకి 5 సార్లు కప్ ను అందించాడు. కీలకమైన కష్టసమయంలో డూ ఆర్ డై సిచ్యువేషన్స్ లో ఎలా కెప్టెన్సీ చేయాలన్నది రోహిత్ శర్మకు తెలిసినట్టుగా కోహ్లీకి తెలియదు.

మహేంద్ర సింగ్ అందరికంటే తోపు కెప్టెన్. అందుకే అతడు రెండు ప్రపంచకప్ లను అందించాడు. పరుగుల యంత్రంగా ఉన్న కోహ్లీ కెప్టెన్సీలో అది సాధ్యం కాలేదు. అతడికి క్రికెట్ పరిజ్ఞానం బుర్ర కాదు.కేవలం పరుగులు చేయడంలో మాత్రమే మిన్న.

ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వేళ అందరి చూపు ముంబై ఇండియన్స్ పైనే ఉంది. ఎందుకంటే గత సారి వారే చాంపియన్స్. రాబోయే ఐపీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ ను ఓడించడం చాలా కష్టం.

ఎందుకంటే ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన వన్డే , టీ20ల్లో సగం మంది ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే ఉన్నారు. అంతేకాదు.. టీమిండియా గెలుపులో వారే కీలకంగా వ్యవహరించారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కృణాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యాలు అద్భుతంగా ఆడి టీమిండియాను విజయం వైపు నడిపించారు.

వీరంతా ఫామ్ లో ఉన్నారు. ఇక పెళ్లి కోసం సెలవు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా సైతం ముంబై ఇండియన్స్ యే. సో సగం మంది టీమిండియా ఆటగాళ్లు ఉన్న ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారంతా మంచి ఫాంలో ఉండడంతో ఈసారి ఐపీఎల్ లో ముంబైని కొట్టే మగాడే ఉంటాడా? అన్న సందేహం క్రికెట్ విశ్లేషకుల్లో ఉంది.

ఈసారి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించడం చాలా కష్టం. ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆ జట్టు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇషాన్, సూర్యకుమార్ తొలి అరంగేట్ర మ్యాచ్ లోనే టీమిండియాతో తరుఫున అదరగొట్టారు. అలాగే హార్ధిక్ పాండ్యా తిరిగి బౌలింగ్ చేస్తుండడం ముంబైకి కొండంత బలం. ఇక వెస్టిండీస్ వీరుడు పోలార్డ్, న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ, సౌతాఫ్రికా టీ20 కెప్టెన్  డికాక్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ముంబైకి ఉన్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ లో ముంబైని కొట్టడం చాలా కష్టమన్న భావన క్రికెట్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

Back to top button