అత్యంత ప్రజాదరణక్రీడలుజాతీయంరాజకీయాలుసంపాదకీయం

స్టేడియాలకు క్రికెటర్ల పేర్లు ఎందుకు పెట్టరు.? ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది?

Why aren't stadiums named after cricketers? How is the world?

క్రికెట్.. భారతదేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆట.. దీంతో అంతర్జాతీయ సంబంధాలు ముడిపడి ఉంటాయి. మనదేశానికి బ్రిటిష్ పాలకులు నేర్పిన ఈ క్రీడతో ఇండియన్ క్రీడాకారులు ఎంతో మంది ఇందులో రాణిస్తున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. విశేషంగా రాణిస్తున్నారు. ఇండియా సైతం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తూ ఇతర దేశాల సరసన నిలుస్తోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించి వార్తల్లోకెక్కింది. అయితే స్టేడియం నిర్మించి గొప్ప పని చేశామంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. క్రీడాకారులు, దేశంలోని నెటిజన్ల నుంచి కొంత నిరాశ వ్యక్తమైన పరిస్థితి కనిపించింది.. ఎందుకంటే..?

అహ్మదాబాద్ లోని మోతెరాలో లక్షా పదివేల మంది ఒకేసారి వీక్షించే స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. దీనిని ఇటీవలే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఆ స్టేడియానికి ‘నరేంద్రమోడీ’ పేరు పెట్టడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఇండియాకు 1983, 2011 వరల్డ్ కప్ లు, ఒక 2020 కప్ సాధించి పెట్టారు మన క్రికెటర్లు. అలాగే అంతర్జాతీయంగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా ఉన్నారు.. ఇక బౌలర్ల విషయంలో కొన్ని విషయాల్లో ఇండియా తరుపున ఆడేవారిదే పైచేయి ఉంది.

అయితే ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న క్రికెటర్ల పేర్లు ఒక్క స్టేడియానికి ఉండదా..? అనే చర్చ సాగుతోంది. క్రికెట్ స్టేడియాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడమే గానీ.. క్రికెట్ క్రీడకు గుర్తింపు తెస్తున్న క్రీడాకారుల పేర్లు పెట్టకపోవడంపై మాజీ క్రీడాకారుల నుంచి నిరాశ ఎదురవుతోంది. క్రికెటర్ల పేర్లతో ఎన్నో సిరీస్ లు ఉన్నాయి. బోర్డర్ -గవాస్కర్ ట్రోపీ తదితర టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. అలాగే క్రికెటర్ల పేర్లతో స్టాండ్లు ఉన్నాయి. సచిన్, ధోని, సెహ్వాగ్ సహా ఎందరో పేర్లతో స్టాండ్లు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇండియాలోనే కాకుండా ఆసియా దేశాల్లోనే ఈ పద్దతి కొనసాగుతోంది. పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ లోనూ క్రికెట్ స్టేడియాలు రాజకీయ నాయకుల పేర్లతో ఉన్నాయి. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం అక్కడి పాలకుడి పేరుతో ఉంది. శ్రీలంకలోని హంబన్ తోటలో ఆ దేశ అధ్యక్షుడ మహింద్రా రాజపక్షే పేరుతో స్టేడియం ఉన్న విషయం తెలిసిందే. వెస్టీండీస్ లో తప్ప మిగతా క్రికెట్ దేశాల్లో రాజకీయ నాయకులు, నదుల పేర్లతో స్టేడియాలు ఉన్నాయి. ఇది క్రికెటర్లను కించపరిచే విధంగా అని కాకున్నా వారి పేరున స్టేడియాలు ఉంటే బాగుండుననే వాదన వినిపిస్తోంది.

మరోవైపు ఇండియాలోని క్రికెట్ స్టేడియాల్లో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరుతో అనేక స్టేడియాలున్నాయి. ఇంకా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియాన్ని చూడొచ్చు. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ పేరుతో స్టేడియం ఉంది. కోళికోడ్ స్టేడియానికి కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్ పేట్టారు. చెన్నైలో చిందంబరం పేరుతో క్రికెట్ స్టేడియం ఉంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం ఉంది. ఇలా రాజకీయ నాయకుల పేర్లున్న స్టేడియాలు కాకుండా.. క్రికెట్ కు గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ల పేర్లు పెడితే బాగుంటుందని క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న వాదన.

Back to top button