తెలంగాణరాజకీయాలు

బీజేపీ తారలు ఇప్పుడెందుకు కనిపించడం లేదు?


కేంద్రంలో అధికారంలోకి రాగానే ఎక్కడెక్కడి నుంచో తారలు వచ్చి కమల దళంలో చేరిపోయాయి. తమకూ అధికారం దక్కుతుందని ఆశపడ్డారు. బీజేపీ టికెట్ పొంది 2019 ఎన్నికల్లో పోటీచేశారు. పార్టీ తరుఫున పని చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీలో సినీ ప్రముఖులందరూ చేరి కళకళలాడేలా చేశారు. కానీ ఇప్పుడు సినీ ప్రముఖులందరూ ఎక్కడికి పోయారు. ఏమైపోయారు. ఎందుకు యాక్టివ్ గా లేరు. అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి ఏ సినీ ప్రముఖులు కూడా సమాధానం ఇవ్వడం లేదు.

Also Read: తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరిగిన సమయంలో చాలా మంది సినీ తారలు బీజేపీలో చేరారు. టాలీవుడ్ యువ హీరోయిన్ రేష్మా రాథోడ్ మహబూబాబాద్ ఎంపీగా బీజేపీ తరుఫున టికెట్ పొంది పోటీచేశారు. అదేవిధంగా ప్రముఖ నటుడు, నేత బాబు మోహన్ ఆంధోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

అదేవిధంగా గత సంవత్సరం నటీమణులు కవిత, మాధవి లత ఏపీలో బీజేపీలో చేరారు. కమలం పార్టీ తరుఫున పోటీ చేశారు. కానీ ఎన్నికలు ముగియగానే వీరంతా కనుమరుగయ్యారు.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

ఈ సినీ తారలంతా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు అదృశ్యమయ్యారు. వారి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇక సినీ ప్రముఖులు కూడా బీజేపీ లో క్రియాశీలకంగా ఒక్కరూ పనిచేయడం లేదు.

పార్టీలో చాలామంది నటులు.. నటీమణులకు విలువనిచ్చినా సరే వారంతా ఏమాత్రం పార్టీని పట్టించుకోకుండా తమ దారి తాము చూసుకోవడం బీజేపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. వీరంతా ఒక్కరు కూడా సొంతంగా ఓట్లు గెలవలేరు. రేష్మా రాథోడ్, బాబూ మోహన్ లు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా కోల్పోయి చిత్తుగా ఓడిపోయారు. ఇక యూపీలోని రాంపూర్ లో కూడా గతంలో రెండు సార్లు గెలిచిన జయప్రద కూడా ఈసారి బీజేపీ హవాలోనూ గెలవడంలో విఫలమైంది.

Tags
Show More
Back to top button
Close
Close