జాతీయం

Affair: అక్రమసంబంధానికి అడ్డు: ప్రియుడి భార్యను చంపేశారు

Jharkhand Murder Case

ఇన్నాళ్లు సాయం చేసిన వ్యక్తి పెళ్లి కాగానే దూరమయ్యాడు. పెళ్లాం మోజులో పడి వారిని పట్టించుకోలేదు. దీంతో వారు అతడి భార్యను అంతమొందించాలని పథకం పన్నారు. సమయం కోసం ఎదురు చూశారు. అదను కోసం కాపు కాశారు. సమయం చిక్కడంతో ఆమెను తుదముట్టించారు. దిండు ముఖం మీద పెట్టి అదిమి పెట్టి చంపేశారు. పోలీసులకు అనుమానం రాకుండా నాటకం ఆడారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని కట్టు కథ అల్లారు. చివరకు కటాకటాలపాలయ్యారు. జీడిమెట్లలో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది.

జార్ఖండ్ కు చెందిన రాజేశ్ వర్మ జీడిమెట్ల పరిధిలోని వినాయక్ నగర్ లో ఐదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. పక్క గదిలో యూపీకి చెందిన సంజిత్, రింకు దంపతులుంటున్నారు. సంజిత్ జులాయిగా తిరుగుతుండేవాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీనికి తోడు అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో రింకుకు రాజేశ్ కు అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈనేపథ్యంలో సంజిత్ కు విషయం తెలిసినా అవసరాల దృష్ట్యా ఏం అనకుండా కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కొన్నాళ్లుగా సాగిన వీరి ప్రేమాయణలోకి పూజ అనే కొత్త పాత్ర ప్రవేశించింది. రాజేశ్ కు పెళ్లి కావడంతో భార్య పూజను తన రూంకు తీసుకొచ్చాడు. దీంతో ఇన్నాళ్లు వారిని ఆదుకున్న రాజేశ్ ఇక మొహం చాటేశాడు. దీంతో వారి సమస్యలు పెరిగాయి. పూజ ఉంటే తమకు దిక్కు లేదని భావించారు. ఎలాగైనా పూజను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు.

ఈ క్రమంలో ఈనెల 10న రాజేశ్ విధులకు వెళ్లిన సమయంలో నిద్రపోతున్న పూజపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఆమె ప్రియుడు, మరో వ్యక్తి వచ్చి గొడవ పట్డారని కట్టుకథ అల్లారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి వారి శైలిలో దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. చివరికి రింకు, సంజిత్ లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ బాలరాజు పేర్కొన్నారు.

Back to top button