తెలంగాణరాజకీయాలు

ఈటల ప్రభావం ఉంటుందా?

Etela Rajenderతెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతున్న క్రమంలో కొత్త పార్టీ ఊసు రావడం సంచలనం కలుగుతోంది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ నూతనంగా పార్టీ పెడతారనే వార్త దావానంలా వ్యాపిస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది. ఓటు బ్యాంకు లేకపోయినా ఎలాగైనా పట్టు సాధించాలనే తపనతోనే కొత్తగా పార్టీల ఏర్పాటు కొత్తేమీ లేదు. గతంలో సైతం తెలంగాణ జన సమితి పేర కోదండరామ్ పార్టీ పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఊసు కొత్తేమీ కాదు.

జాతీయ పార్టీలున్నా..
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఓటు బ్యాకు పరంగా టీఆర్ఎస్ 40 శాతం ఓట్లతో అధికారం చేజిక్కించుకుంటుండగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కేవలం 20 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం అప్పుడే కోదండరామ్ పార్టీ స్థాపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రాంతీయ పార్టీగా టీజేఎస్ తన ఉనికిని చాటుకోలేకపోయింది. దీంతో ఆయన అబాసుపాలయ్యారు. దీంతో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ లేకుండా పోయింది.

అన్ని పార్టీలు కలిస్తే..
టీఆర్ఎస్ ను దెబ్బతీయాలంటే అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా కలిస్తే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పరిశీలిస్తే టీఆర్ఎస్ కు మిగతా పార్టీలకు తేడా బాగా ఉంది. దీంతో రోజరోజుకు పోలైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించడంతో మిగతా పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ర్టంలో తన ప్రభావాన్ని చూపలేకపోతోంది.

తాజా పరిణామాలతో..
రాష్ర్టంలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే రాష్ర్టం అంతా కాకపోయినా జిల్లా వ్యాప్తంగా కొంత మేర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటు బ్యాకు పెద్దగా లేకపోయనా టీఆర్ఎస్ ఓట్లను ఏ మేరకు చీల్చుతారో వేచిచూడాల్సిందే.

Back to top button