ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలు

లోకేష్ ‘అందరివాడు’లా మారతాడా?

టీడీపీ గతంలో ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజాన్ని సైకిల్ తట్టుకోలేక చతికిలపడింది. అయితే ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయినా టీడీపీ గత ఓటమిని ఇంకా తెరుకోలేకపోవడం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయస్సు పైబడటంతో మునుపటిలా రాజకీయాలు చేయడంలేదని టాక్ టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తోంది. దీంతో టీడీపీ ఆశాకిరణంగా లోకేష్ బాబును తెరపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?

టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ బాబు ఎమ్మెల్సీగా ఎన్నికై ఐటీ మంత్రిగా పని చేశారు. అయితే కిందటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి లోకేష్ బాబు ఓటమి చెందడంతో ఆయన స్టామినాపై అనుమానాలు రేకెత్తాయి. సీఎం కొడుకుగా, మంత్రిగా పనిచేసిన లోకేష్ బాబు ఎమ్మెల్యేగానే గెలువకుంటే మున్ముందు పార్టీని ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో కొందరు టీడీపీ నాయకులు లోకేష్ నాయకత్వంపై పెదవి విరుస్తున్నారు.

ఇటీవల కొందరు టీడీపీ ఎమ్మెల్యే పార్టీని వీడి సమయంలోనూ లోకేష్ నాయకత్వంలో విమర్శలు చేశారు. దీంతో ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు లోకేష్ బాబు కేవలం ట్వీటర్లో ట్వీట్లకే పరిమితం అవడం కూడా విమర్శలు తావిచ్చింది. అయితే ఇటీవల కాలంలో లోకేష్ బాబు పార్టీపై పట్టు సాధించేందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చంద్రబాబు సైతం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడనే టాక్ విన్పిస్తోంది. అయితే లోకేష్ మాత్రం టీడీపీ నాయకులపై పెత్తనం చేసేందుకు చూస్తుండటంతో ఆయనపై నేతల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ అవడంతో బాబు పార్టీ నేతలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక లోకేష్ సైతం పార్టీ నేతలను కలుపుకుపోయేందుకు యత్నిస్తున్నారు. సైకిల్ యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకునేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం లోకేష్ తన తండ్రిలా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Also Read: చంద్రబాబు, పీవీ.. ఒక మరుపు కథ.!

ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటేనే భవిష్యత్లో టీడీపీ ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది. అన్ని కలిసొస్తే సీఎం అయినా ఆశ్చర్యపోనవరం లేదని నేతలు అంటున్నారు. ఈనేపథ్యంలో లోకేష్ బాబు టీడీపీ అందరివాడుగా మారుతారా? లేదా కొందరివాడుగా ఉండటా? అనేది వేచి చూడాల్సిందే..!

Back to top button