టాలీవుడ్సినిమా

షూటింగులకు మరోసారి లాక్ డౌన్ తప్పదా?


తెలంగాణలో రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. లాక్డౌన్ కఠినంగా అమలు చేసినన్నీ రోజులు కేసుల సంఖ్య అంతంత మాత్రంగా ఉంటేవీ. ఎప్పుడైతే రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చారో నాటి నుంచి కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. మహానగరం హైదరాబాద్ అయితే కరోనా గుప్పట్లోకి వెళ్లినట్లు కన్పిస్తుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 985 కరోనా కేసులు నమోదుకాగా జీహెచ్ఎంసీ పరిధిలో 774 కేసులు నమోదవడం గమనార్హం.

పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?

టాలీవుడ్ పరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో సినిమా, టీవీలకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా షూటింగుల సందడి మొదలు కాలేదు. స్టార్ హీరో, హీరోయిన్లు కొద్దిరోజులపాటు వేచిచూసే ధోరణిలో ఉండటంతో ఇప్పట్లో షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. మరోవైపు హైదరాబాద్లో టీవీ సీరియల్స్, ఇతర షోలకు సంబంధించి షూటింగులు చేస్తున్నప్పటికీ కరోనా నియంత్రణ పాటించడం లేదని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఓ ప్రముఖ టీవీ సీరియల్ నటుడికి కరోనా రావడంతో షూటింగును నిలిపివేశారు. ఈ షూటింగుల్లో పాల్గొన్న వారందరిని నిర్మాత హోంక్వారంటైన్ కు తరలించారు. ఈ సంఘటన టెలివిజన్ రంగంలో కలకలం రేపింది. టీవీ షూటింగులు చేసే నిర్వాహాకులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించింది. ప్రస్తుత నేపథ్యంలో షూటింగులు చేయడం వల్ల కరోనా మరింత మందికి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం షూటింగులను నిలిపివేసేందుకు మొగ్గుచూపుతుందని సమాచారం. ఈమేరకు 14రోజులపాటు షూటింగులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చిత్రపరిశ్రమ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పడిప్పుడే పట్టాలెక్కుతున్న టీవీ షూటింగులకు కరోనా మరోసారి బ్రేక్ వేసేలా కన్పిస్తుంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఈనేపథ్యంలో షూటింగులు కూడా మరో రెండు వారాలు స్వచ్చంధంగా లాక్డౌన్ విధించుకుంటే వారికే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చిత్రపరిశ్రమ నడుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగుల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!