టాలీవుడ్సినిమా

బసవతారకం లేకుంటే ఎన్టీఆర్ ఉండేవాడే కాదట!

భర్త నిర్ణయానికి మద్దతుగా నిలిచి ఏకంగా తన వడ్డాణం అమ్మి..

basava tarakam ntr
ఎన్టీఆర్.. టాలీవుడ్ పరిశ్రమ ఉన్నన్నీ నాళ్లు ఆయన ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూలస్థంభాల్లో ప్రథముడు.  సినిమాల్లో వెలుగు వెలిగి అనంతరం రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడాయన.. అంతటి మహానుభావుడి జీవిత చరిత్రను చాటిచెప్పాలని ఆయన కుమారుడు బాలక్రిష్ణ  ఎన్టీఆర్ బయోపిక్ లు కూడా తీశాడు. అందులో బసవతారకం త్యాగశీలతను చూపించాడు.

ALso Read: ‘రింగు’లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

ఎన్టీఆర్ జీవితంలో ఆయన భార్య బసవతారకం ఎంతో కీలక పాత్ర పోషించారు.  ఎప్పుడు ఎన్టీఆర్ విజయాలను మాత్రమే అందరూ చూశారు. కానీ దాని వెనకుండి అన్నీ తానై నడిపించిన బసవతారకం కష్టాలను మాత్రం చూడలేదు.  బసవతారకం గొప్పతనం తెలుసు కాబట్టే బాలయ్య ఆమె పేరు మీద క్యాన్సర్ హాస్పటల్ కట్టాడు. పిల్లల కోసం జీవితాన్ని ధారపోసిన మహిళగా బసవతారకం నిలుస్తుంది.

నందరమూరి తారకరామరావు 28 మే 1923లో నిమ్మకూర్ లో జన్మించాడు. అప్పటికి మన దేశం బ్రిటీష్ పరిపాలనలో ఉంది. అదే ఊరిలో ఎన్టీఆర్ ఐదో తరగతి వరకు చదివారు.. ఎన్టీఆర్ చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారట.. అందువల్ల ఆరోతరగతి తన తండ్రి గారైన లక్ష్మణచౌదరి గారు విజయవాడలో గాంధీ మున్సిపల్ స్కూల్ లో చేర్పించారు. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది.. ఆ తరువాత 1940లో ఎస్ ఆర్ఆర్ మరియు సీబీఆర్ కళాశాలో ఇంటర్మీటియట్ విద్యను అభ్యసించారు. మొదటి సంవత్సరం చదువుతుండగా నాటకాలు వేస్తుండే వారట.. అంటే ఆయన నటన ఈ కళాశాల నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయట.. దీంతో ఎన్టీఆర్ గారు ఇంటింటికీ వెళ్లి పాలను అమ్మేవారట..

ఎన్టీఆర్ రకారకాల కారణాల వల్ల ఇంటర్మీటియట్ రెండుసార్లు ఫెలయ్యాడు.. ఇంటర్ తర్వాత గుంటూర్ లో ఏసీ కాలేజ్ లో డిగ్రీ చదివారు. అక్కడే నటుడు జగ్గయ్య పరిచయమయ్యారు. అయితే ఇంటర్ దెబ్బతో చదువు ఆశ్రద్ధ చేయకూడదని డిగ్రీ చదువు విజయవంతంగా పాసయ్యారు. 1947లో మద్రాస్ వాళ్లు కండక్ట్ చేసిన సబ్ రిజిస్ట్ర్రార్ పరీక్షలు రాశారు. ఇందులో ఏడువందల మంది సెలక్ట్ అయ్యారు. అయితే ఇందులో ఏడుగురు మాత్రమే సెలక్ట్ అయ్యారు. అందులో ఎన్టీఆర్ ఒకరు.. అక్కడితో తల్లిదండ్రలు కొడుకుకు మంచి ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషపడ్డారు. 1948లో గుంటూర్ లో రిజిస్ట్ర్రార్ వారి కార్యాలయంలో పనిచేశారు. అప్పటికి ఆయన జీతం 180 రూపాయలు వచ్చేవాట..

మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్   సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం రాగానే బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ ఉద్యోగంలో సంతృప్తి చెందక సినిమాల్లో చాన్సుల కోసం ప్రయత్నిస్తానని బసవతారకంతో అన్నాడట.. భర్త నిర్ణయానికి మద్దతుగా నిలిచి ఏకంగా తన వడ్డాణం అమ్మి మరీ ఆ డబ్బులతో ఎన్టీఆర్ ను చెన్నైకి పంపించిందట బాసవతారకం.. సినిమాల్లో బిజీ అయిన తర్వాత 12 మంది సంతానాన్ని సమర్థంగా పెంచుకుంటూ ఎంతో నేర్పుతో, ఓర్పుతో పెంచి పెద్ద చేసిందట.. బాలయ్య, హరికృష్ణ, రామకృష్ణలను హీరోలుగా చేయడంలో బాసవతారకం పాత్ర ఎంతో ఉంది.  ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉంటే కుటుంబ బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకుందట బాసవతారకం..   ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో సమానంగా ఎన్నో సృశించని నిజాలు బసవతారకంలో ఉన్నాయి.

ALso Read: లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ !

సినిమాల్లో, రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించిన ఎన్టీఆర్ కు ఆయన భార్య బసవతారకం అంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం..  ఇన్ని ఒడిదుడుగుల మధ్య ఆయన భార్యపై ప్రేమ ఎంత వరకు తగ్గలేదట.. ప్రతి రోజు ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లలంటే ఆయన భార్య బసవతారం ముందుండాల్సిందే.. అటు రాజకీయాల్లో ఇటు సీనిమాలతో ఎంత బిజీగా ఉన్న ఆయన భార్యపై ఎంతో గౌరవంగా ప్రేమతో చూసుకునే వారట..  వీలు దొరికినప్పుడల్లా ఆయన భార్యతో సమయం కేటాయించేవారట.. దాదాపు 1970లలో బసవతారకం క్యాన్సర్ వ్యాధితో మృత్యువాత పడింది.. అయితే అప్పటి నుంచి ఆమె పేరిట వివిధ సేవ కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలు నెలకొల్పారు.. హైదరాబాద్ లో ఎన్టీఆర్ భార్య పేరిట బసవతారం అనే పేరు మీద క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించారు. బడుగు బలహీన వర్గాలకు ఈ ఆస్పత్రిలో ఉచిత సేవలు అందిస్తున్నారు.  ప్రస్తుతం హీరో బాలక్రిష్ణ ఈ బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

Back to top button