అత్యంత ప్రజాదరణప్రత్యేకంవ్యాపారము

మహిళలకు సీఎం జగన్ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.18,750..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా సంక్షేమ పథకాలను మాత్రం తప్పనిసరిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల్లో వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా జగన్ మహిళల ఖాతాల్లో ఏకంగా 18,750 రూపాయలు జమ చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఎవరైనా ఈ స్కీమ్ లో జాయిన్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. ఎవరైతే పుట్టిన తేదీని మార్చుకొని ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేస్తే మాత్రం ఈ స్కీమ్ యొక్క నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ పొందడం సాధ్యం కాదు.

వచ్చే నెలలో ఏ తేదీన ఈ స్కీమ్ నగదు జమవుతుందో తెలియాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ నెలలో రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్న జగన్ సర్కార్ వచ్చే నెలలో వైఎస్సారు చేయూత స్కీమ్ ను అమలు చేస్తోంది. జగన్ సర్కార్ పథకాలను అమలు చేస్తున్న తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కష్టాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా జగన్ మాత్రం స్కీమ్ లను సరిగ్గా అమలు చేస్తున్నారు. ఈబీసీ మహిళలకు కూడా జగన్ మరో స్కీమ్ ద్వారా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

Back to top button