క్రీడలు

WTC Final: కివీస్ కు షాక్.. పోటీలోకి టీమిండియా

WTC Final: Shock to the Kiwis .. Teamindia into the competition

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ రసకందాయంలో పడింది. 5వరోజు వర్షం తగ్గి ఆట ప్రారంభం కావడంతో అభిమానులు ఊరట చెందారు. వర్షం కారణంగా గంట పాటు ఆలస్యంగా టీమిండియా తొలి సెషన్ ఆరంభమైంది.

టీమిండియా తొలి సెషన్ లో 3 వికెట్లతో న్యూజిలాండ్ పై పైచేయి సాధించింది. తొలుత 101/2 వికెట్లతో మంగళవారం ఆటను విలయమ్సన్, రాస్ టేలర్ ప్రారంభించారు. వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. భారత పేసర్లను సమర్థంగా కాచుకొని నెమ్మదిగా పరుగులు తీశారు. న్యూజిలాండ్ జట్టు 33 పరుగులే సాధించి నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 135/5గా నమోదైంది.

ప్రస్తుతం ఐదు వికెట్లనే భారత బౌలర్లు కుప్పకూల్చారు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (19), గ్రాండ్ హోమ్(0) క్రీజులో ఉన్నారు.

జట్టు స్కోరు 117 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో రాస్ టేలర్ (11) శుభ్ మన్ గిల్ చేతికి చిక్కడంతో వికెట్ల వేట మొదలైంది. తర్వాత భోజన విరామానికి ముందు వరస ఓవర్లలో ఇషాంత్ హెన్రీ నికోల్స్ (7)ను, జేబీ వాట్లింగ్ (1)ను పెవిలియన్ కు పంపారు. దీంతో టీమిండియా మళ్లీ పోటీలోకి వచ్చింది.

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్ కన్నా 82 పరుగుల వెనుకంజలో ఉంది. ఆ లోటు తీరుస్తుందా? లేక భారత్ వికెట్ల వేటతో పైచేయి సాధిస్తుందా? లేదా చూడాలి మరీ..

Back to top button