ప్రత్యేకంవ్యాపారము

కస్టమర్లకు షావోమి బంపర్ ఆఫర్.. ఫోన్లపై 70 శాతం బైబ్యాక్..?


ఈ మధ్య కాలంలో కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో కంపెనీలు కొత్తకొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల కోసం స్మార్ట్‌ అప్‌గ్రేడ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. మరో వారంలో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో షామోమీ ఈ ఆఫర్ ను ప్రకటించింది. కస్టమర్ల కోసం ఎక్స్చేంజ్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

ఎవరైతే ఈ ఆఫర్ ను పొందాలనుకుంటారో వాళ్లు భవిష్యత్తులో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే సమయంలో ఏకంగా 70 శాతం తక్కువ డిస్కౌంట్ ను పొందవచ్చు. బై బ్యాక్ ఆఫర్ కింద షావోమీ తెచ్చిన ఈ ఆఫర్ తరచుగా ఫోన్లను మార్చే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ ఈ స్కీమ్ ను ఆవిష్కరించి ఈ స్కీమ్ కు సంబంధించిన విశేషాలను తెలియజేశారు.

కేవలం 399 రూపాయలు చెల్లించి ఈ స్కీమ్ లో చేరవచ్చని చెప్పారు. ప్రసుతం షావోమీ కొత్త ఫోన్ ను కొనుగోలు చేసేవాళ్లు బైబ్యాక్ ఆఫర్ ను ఎంచుకుంటే ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ అప్ గ్రేడ్ ప్లాన్ ఫోన్ కొనుగోలు చేసిన మూడు నెలల నుంచి 15 నెలల మధ్య కాలంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బై బ్యాక్ వాల్యూ ఫోన్ కండీషన్ తో పాటు ఇతర విషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

షావోమీ ఫోన్ కొనుగోలు చేసిన 4 నుంచి 6 నెలల వరకు 70 శాతం బైబ్యాక్, 7 నుంచి 9 నెలల వరకు 60 శాతం బైబ్యాక్, 10 నెలల నుంచి 12 నెలల వరకు 50 శాతం బైబ్యాక్ వ్యాల్యూ ఇస్తుంది. ఫోన్ కొన్న 12 నుంచి 15 నెలల వరకు అయితే మాత్రం కేవలం 40 శాతం బైబ్యాక్ మాత్రమే లభిస్తుంది. షావోమీ కొత్త స్కీమ్ వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎక్కువగా షావోమీ ఫోన్లను వినియోగించే వినియోగదారులు ఈ కొత్త స్కీమ్ ను ఎంచుకోవచ్చు.

Back to top button