ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలుసంపాదకీయం

సోము వీర్రాజుపైనే ధిక్కారం.. బీజేపీలో ఏంటి అపచారం?

మిగతా పార్టీలన్నింటి కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువ అంటారు. అందులో వారసత్వ పోకడలు తక్కువ అంటారు. ఒక ఛాయ్ వాలాను దేశ ప్రధానిని చేసిన పార్టీ అది. అలాంటిది కాంగ్రెస్ సహా ఏ రాజకీయపార్టీలోనూ జరగదు.

ఇక అంత దాకా ఎందుకు.. మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గల కరుడుగట్టిన హిందుత్వభావజాలంతో బీజేపీ కోసం కొన్ని ఏళ్లుగా పోరాడిన వారే. ప్రజల్లో తిరిగే ఆ ఫైర్ బ్రాండ్ లకే  అందలం దక్కింది.. బీజేపీకి బండి సంజయ్, సోము వీర్రాజులు అధ్యక్షులయ్యారు.

Also Read: కిమ్ జాంగ్ ఉన్ ద‌గ్గ‌ర‌.. 2000 మంది సెక్స్ బానిస‌లు!

బీజేపీలో వలసవచ్చిన వారికంటే పార్టీ కోసం పాటు పడ్డ వారికే అందలమని.. ఇంతటి క్రమశిక్షణగల పార్టీలో ఎవ్వరైనా సరే పార్టీ కోసం కాంప్రమైజ్ అవుతారు కానీ బయటపడరనే టాక్ ఉంది.

బీజేపీ పార్టీ గీసిన గీతను ఎవరూ దాటరు. 75 ఏళ్ల తర్వాత  రాజకీయాల్లో వృద్ధ నేతల రిటైర్ మెంట్ ను కూడా బీజేపీలో అమలు చేస్తున్నారు. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే.. బీజేపీలోని నేతలంతా ఒక్కమాట మీద నిలబడుతారని అర్థం చేసుకోవచ్చు.

అయితే తాజాగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ఏబీఎన్ చానల్ లో దాడి జరిగింది. దీనిని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రంగా ఖండించి ఏకంగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని నిషేధించారు. ఆ చానెల్ కు ఎవరూ వెళ్లొద్దని.. చర్చలు జరపవద్దని బహిష్కరించారు. బాధిత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఏబీఎన్ కుట్రను బయటపెట్టి ఆ చానెల్ ను దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.

అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బీజేపీ పెద్దలు అంతా నిషేధించినా సరే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ ఆంధ్రజ్యోతికి ఎడిటోరియల్ రాయడం చర్చనీయాంశమైంది.. ఏపీ బీజేపీ మొత్తం బహిష్కరించినా ఆయన మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ వ్యాసం రాయడం చూసి బీజేపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.

Also Read: కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే.. వాహనదారులకు ఊరటే

క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో వై సత్యకుమార్ చర్య అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఆంధ్ర బీజేపీలో ఎవరిదారి వారిదేనా? అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కన్నా వారి సొంత ప్రాభవం కోసం ఏదయినా చేస్తారా ? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోము వీర్రాజు, పార్టీ అంతా కట్టుబడి మొండిగా నిలబడుతున్నా.. సత్యకుమార్ మాత్రం ఇలా తన సొంత క్రెడిట్ కోసం పార్టీ పట్టుదలను ఫణంగా పెట్టి పార్టీకి తీరని అవమానాన్ని మిగిల్చారన్న ఆవేదన సగటు బీజేపీ కార్యకర్తలు నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి వారి వల్ల రాజకీయాల్లో విశ్వసనీయత పోతుందని.. ఇలా చేయడం వల్లే అలాంటి చానెళ్లు తెగబడుతున్నాయని ఆరోపిస్తున్నారు. వై సత్యకుమార్ పై చర్య తీసుకోవాలన్న డిమాండ్ బీజేపీలో వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button