ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

మద్య నిషేధంపై పట్టించుకుంటారా?

Jaganఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు పెరుగుతున్నాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నా ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మద్యనిషేధం ఒకటి. దాని అమలుకు ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. మద్యనిషేధం విధిస్తే రాష్ర్ట ఆదాయం దెబ్బతింటుందని భావించిన జగన్ దాని ఊసే ఎత్తడం లేదు. దీంతో ప్రతిపక్షాలు మాత్రం మద్యనిషేధంపై ప్రభుత్వ విధానమేమిటో చెప్పాలని పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు ఇరకాటంలో పడినట్లయింది.

వాగ్దానాల అమలులో భాగంగా..
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు జగన్ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేర్చారు. ఇంకా మిగిలిపోయిన వాటి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకునే క్రమంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం హామీల అమలు పూర్తయినా ఇంకా మిగిలిన వాటిని సైతం సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

కరోనా ప్రభావంతో..
కరోనా మహమ్మారి రెండేళ్లుగా విలయతాండవం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను చాలా వరకు దెబ్బతీసింది. దీంతో అప్పులు చేసైనా రాష్ర్ట ప్రజల అవసరాలు తీర్చేందుకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో బాగంగానే మద్యం దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మద్య నిషేధం విధిస్తే ఖజానా పూర్తిగా ఖాళీ అవుతుంది. దీంతో పరిస్థితి ఏమవుతుందనే భయంతోనే మద్య నిషేధం జోలికి వెళ్లడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. మద్యం దుకాణాలు తగ్గించారు. ధరలు పెంచారు. బెల్టు షాపులు తొలగించారు. ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరిగినా హామీ మాత్రం అలాగే ఉండిపోయింది.

భవిష్యత్తుపై భరోసాతో..
జగన్ సర్కారు భవిష్యత్తుపై భరోసాతో ఉంది. ఎలాగైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో భాగంగా పలు నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన విషయంపై తర్జనభర్జన పడుతోంది. వైరస్ తగ్గుముఖం పడితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుని లాభాల్లో పయనించి మంచి పరిస్థితులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది. ఏదిఏమైనా ఏపీ సర్కారుకు కష్టాలు తొలగి మంచి పరిస్థితులు రావాలని ఆశిద్దాం.

Back to top button